Illu Illalu Pillalu Today Episode june 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు సేటు ఎలాగైనా నెల రోజుల్లో 10 లక్షలు ఇవ్వకుంటే మాత్రం ఇంట్లో చెప్పేస్తాడంట.. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకన్నా నువ్వే అర్థం చేసుకో అనేసి అంటాడు. ఆ మాట వినగానే షాక్ అయిన శ్రీవల్లి బయటకు వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. బుజ్జి అక్కడికి వచ్చి అక్క మీ హనీమూన్ కి వెళ్తున్నారా అని అడుగుతుంది. శ్రీవల్లి ఏడవడం చూసి పది లక్షల గురించి అయినా అడిగాడు అమ్మ మాత్రం ఏమీ చెప్పదు అని టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. భాగ్యం డబ్బులు ఇవ్వకుండా ఏదోకటి మ్యానేజ్ చెయ్యాలి.. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావా.. నా కొడుకుని ఎలా పుట్టావే నువ్వు అంటూ అరుస్తుంది. శ్రీవల్లి మాత్రం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. చెల్లెలు బుజ్జి నేర్చుకుంటూ అక్క దగ్గరికి వెళ్తుంది. అక్క మీ తోడికోడలు ఇద్దరికి 10 లక్షలు మేటర్ తెలిసిపోయింది అక్క.. మీ అక్క ఎందుకు 10 లక్షల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది అని అడిగారు.. బలవంతంగా నా చేత నిజం చెప్పించాలని చూశారు.. కానీ శ్రీవల్లితో గొడవకు దిగితుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. నర్మద అక్కడికి వెళ్లి ఏంటి ప్రేమ ఈ మధ్య నువ్వు ప్రేమలో పడినట్టు ఉన్నావు కదా అనేసి అడుగుతుంది. అదేంటి అక్క అలా అన్నావు అని అంటుంది ప్రేమ. ఏం లేదు ఈ మధ్య నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ధీరజ్ కోసం ఎదురు చూస్తున్నావు అంతా ఏదో కొత్త కొత్తగా ఉంది అని అంటుంది.. నర్మద మాట విన్న ప్రేమ సిగ్గుపడుతూ లోపలికి వెళుతుంది. అప్పుడే ధీరజ్ ఇంటికి వస్తాడు ప్రేమ ధీరజ్ కి ప్రేమగా వడ్డిస్తుంది. ఇదంతా చూస్తున్న నర్మదా నువ్వు కచ్చితంగా ధీరజ్ని ప్రేమిస్తున్నామని కన్ఫామ్ చేస్తుంది.
ఇదంతా కాదు నువ్వు ధీరజ్ కోసం వెయిట్ చేస్తున్నావు కదా.. మీరిద్దరి మధ్య లవ్ ఉందో లేదో నేను చెప్తాను అని చాటుగా చూస్తూ ఉంటుంది నర్మదా.. అయితే ధీరజ్ మొదట ఆశ్చర్యంగా ఫీల్ అయిన కూడా.. ఆ తర్వాత ప్రేమను పొగడడంతో ప్రేమ కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. అది చూసిన నర్మదా నువ్వు నిజంగానే ధీరజ్ను ప్రేమిస్తున్నావని హింట్ ఇచ్చేస్తుంది. ఇక ప్రేమ నిజంగానే ఇద్దరు మధ్య ప్రేమ ఉందని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది.
చందు బయట ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు.. శ్రీవల్లి అన్న మాటలు తలుచుకుంటూ నర్మదా ప్రేమలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. అయితే అప్పుడే సాగర్ అక్కడికి వచ్చి ఏంటన్నయ్య నువ్వు ఒక్కడివే కూర్చున్నావు. చెప్పింటే నేను ధీరజ్ కూడా వచ్చి దాబా పై కూర్చున్న వాళ్ళం కదా అనేసి అంటాడు.. కానీ చందు మాత్రం నీకు ఎన్ని సార్లు చెప్పానురా నర్మదను మీ వదిన విషయంలో జోక్యం చేసుకోవద్దని నువ్వు ఎందుకు నర్మదకి చెప్పుకోవట్లేదు అని అంటాడు. నర్మదని గెలికితే తప్ప నర్మద కావాలనే ఎవరి విషయంలో జోక్యం చేసుకోదు అన్నయ్య అది నీకు కూడా తెలుసు అని సాగర్ అంటాడు.
వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారని అటుగా వెళుతున్న ధీర చూసి వాళ్ళ దగ్గరికి వస్తాడు. నువ్వు కూడా ఏంట్రా ప్రేమకు చెప్పుకోకుండా మీ వదిన ఎంత బాధ పడుతుందో ఆలోచించవా అని అరుస్తాడు.. ప్రేమ ట్యూషన్ విషయం నాన్నకు చెప్పి ప్రేమని నాన్న చేత తిట్టిచ్చింది. అది నువ్వు మర్చిపోయావా అన్నయ్య అని ధీరజ్ అంటాడు.. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకుంటున్నారా అని చందు వాదిస్తాడు.. మీ వదిన విషయంలో మీ భార్యలు జోక్యం చేసుకుంటే ఇంకొకసారి బాగోదని వార్నింగ్ ఇస్తాడు. అదే మాట మేం కూడా అనొచ్చు అన్నయ్య వదిన మా భార్యల విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని ధీరజ్ అంటాడు.
అన్నయ్య కే వార్నింగ్ ఇచ్చే రేంజ్ కి దిగావా రా.. అంతేలేరా మీ భార్య వచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు అని చందు అంటాడు. వీళ్ళందరూ మాట్లాడుకోవడం చూసి వేదవతి బయటకు వస్తుంది.. ఇంక ఆపండి రా మీ భార్యల కోసం మీరు కొట్టుకోవడం ఏంట్రా అనేసి అరుస్తుంది.. అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ అనేసి వేదవతి అడుగుతుంది.. శ్రీరామచంద్రు లాంటి అన్నదమ్ముల మధ్య ఈ గొడవలు ఏంట్రా ఎందుకురా ఈ మనస్పర్ధలు మీ మధ్య అని వేదవతి అడుగుతుంది. మీరు ఇక మీద నుంచి ఎప్పుడు గొడవపడనని నాకు మాట ఇవ్వండి అని వేదవతి అనగానే చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ కూడా వెళ్లిపోవడంతో సాగర్ కూడా వెళ్ళిపోతాడు..
అమ్మ చేతిలోంచి మీరు జారిపోయారా ? ఏంటా ఇది దీనికి ఎలాగైనా ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అని వేదవతి అనుకుంటుంది. ఇక రామరాజుకు ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గానే చెప్తుంది. అది విన్న రామరాజు నువ్వు కోడల విషయాన్ని చూసుకో నేను కొడుకుల విషయాన్ని చూసుకుంటాను. ఏ పంచాయతీని నట్టింట్లోకి వచ్చేలా చూసుకోవద్దు అనేసి అంటాడు.. ఇక ప్రేమ అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తుంది. ఇంత తొందరగా నిద్ర లేచాను ఏంటి? అసలు నిద్ర పట్టడం లేదేంటి? నిజంగానే నేను ప్రేమలో ఉన్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది.. ధీరజ్ కి తనకి మధ్య లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి బుక్ తీసుకుని బయటకు వస్తుంది. ప్రేమను ఒక్కసారిగా బయట చూడడంతో ధీరజ్ కెవ్వు కేక వేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో వేదవతి ముగ్గురు కోడళ్ళకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..