HBD Sakshi Shivanand: చూడగానే.. మనవాళ్లు అని ఓన్ చేసుకునే అతి కొద్ది మంది హీరోయిన్స్ లో సాక్షి శివానంద్ (Sakshi Shivanand) కూడా ఒకరు. అందమైన రూపం.. చక్కటి చిరునవ్వు.. అలరించే నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె..హిందీ, తెలుగు అంటూ భాషతో సంబంధం లేకుండా ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంకాస్త స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని.. ఇంకొంతకాలం ఇండస్ట్రీలో కొనసాగాలనుకున్న ఈమె.. అనుకోకుండా అండర్ వరల్డ్ దృష్టిలో పడి సడన్గా వెండితెరకు దూరమైంది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అండర్ వరల్డ్ భయపడి ఇండస్ట్రీ నుండి పారిపోయిన హీరోయిన్..
సాక్షి శివానంద్ 1993లో వచ్చిన ‘అన్నా వదిన’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా సక్సెస్ అవడంతో హిందీ చిత్రాలలో కూడా ఆఫర్లు లభించాయి. అలా అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ కూడా సక్సెస్ ను ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమాతో మళ్ళీ ఇక్కడికి రీ ఎంట్రీ ఇచ్చి అలరించింది. ఈ సినిమా హిట్ అవడంతో రాజశేఖర్ (Rajasekhar ) ‘సింహరాశి’తోపాటు ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాలతో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా 90 లలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి స్టార్ డంను అందుకుంది.అంతేకాదు అటు బాలీవుడ్ లో కూడా పేరు సొంతం చేసుకుంది. అదే సమయంలో 90 లలో ‘అండర్ వరల్డ్’ పేరు బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు దావూద్ ఇబ్రహీం, హాజీ మస్తాన్ లతో సన్నిహితంగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి వారితో టచ్ లో ఉండాల్సి వచ్చిందని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అంతే కాదు అప్పట్లో అండర్ వరల్డ్ తమ సొంత డబ్బును ఎక్కువగా సినిమాల్లో పెట్టుబడిగా పెట్టారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంటున్న సమయంలో సాక్షి శివానంద్ కూడా ఈ మాఫియా దృష్టిలో పడిందట. ఇక ఆ సమయంలో తనకు వారి నుంచి కాల్స్ రావడంతో భయపడిపోయారని, ఆ భయంతోనే సినిమాలను వదిలేసారని సమాచారం. ఇక ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తో కలిసి ‘తుమ్ ‘ అనే చిత్రంలో నటిస్తోందట సాక్షి శివానంద్. ఇక సినిమా తర్వాత బాలీవుడ్ కి బాయ్ చెప్పేసి మళ్ళీ సౌత్ ఇండియా సినిమాల్లో చేయాలనుకుంది.
స్టార్ హీరోయిన్ రేంజ్.. కానీ వంటింటికే పరిమితం..
అలా తెలుగులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి నాగార్జున (Nagarjuna) తో ‘సీతారామరాజు’, ‘పెళ్లి వారమండి’, మోహన్ బాబు(Mohanbabu)తో ‘యమజాతకుడు, బాలకృష్ణ(Balakrishna ) తో ‘వంశోద్ధారకుడు’, మహేష్ బాబు(Mahesh Babu) తో ‘యువరాజు’ వంటి చిత్రాలలో నటించింది. జెడి చక్రవర్తి దర్శకత్వం వహించిన ‘హోమం’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి.. చివరిగా ‘రంగా ది దొంగ ‘ లో కనిపించి, ఇక ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఇక ఆ అండర్ వరల్డ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ కి భయపడి ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. లేకుండా అక్కడే అలాగే ధైర్యంగా కొనసాగి ఉండి ఉంటే నేడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునేదేమో. ఇక ఇండస్ట్రీకి దూరమైన ఈమె అమెరికాకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 2016లో పెళ్లి చేసుకొని, ఒక పాపకు జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం గృహిణి గానే కొనసాగుతోంది. ఈరోజు సాక్షి శివానంద్ బర్త్డే కావడంతో మళ్ళీ ఆమె వెలుగులోకి వచ్చారు. ఇప్పుడైనా రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.