BigTV English

OTT Movie : జీ 5 లో తప్పకుండా చూడాల్సిన టాప్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

OTT Movie : జీ 5 లో తప్పకుండా చూడాల్సిన టాప్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

OTT Movie : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఓటిటి ప్లాట్ ఫామ్ వేదికగా మారింది. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా పోటాపోటీగా ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అదే రీతిలో ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తున్నారు. అయితే వీటిలో సైకలాజికల్ సినిమాలు ఎంటర్టైన్ చేసే తీరు వేరుగా ఉంటుంది. చివరి వరకు ఇవి ఉత్కంఠభరితంగా సాగుతూ, చూపు తిప్పుకోకుండా చేస్తాయి. థియేటర్లలో విజయ ఢంకా మోగించి, ప్రస్తుతం జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం.


రామన్ రాఘవ్ 2.0 (Raman Raghav 2.0)

2016 లో వచ్చిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు.  కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, వికాస్ బహ్ల్ మధు మంతెన నిర్మించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్, శోభితా ధూళిపాలా నటించారు. ఈ స్టోరీ 1960లో ఒక సీరియల్ కిల్లర్ రామన్న చుట్టూ తిరుగుతుంది. అతని పట్టుకోవడానికి రాఘవన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీలో రాఘవన్ హత్యలతో పాటు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉంటాయి.


పోషం పా (Posham Pa)

2019 లో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించారు. ఇందులో మహి గిల్, సయానీ గుప్తా, రాగిణి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా స్టోరీ సీరియల్ కిల్లర్‌లు, పిల్లలను సామూహికంగా హత్య చేయడాన్ని చూపిస్తుంది. ఇది ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు.  1996 వ సంవత్సరంలో 40 మంది పిల్లలను కిడ్నాప్ చేసి, 12 మంది పిల్లలను హత్య చేసిన సీరియల్ కిల్లర్స్ అంజనా ఆమె ఇద్దరు కుమార్తెలు సీమా గవిత్, రేణుకా షిండే ల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సీమా, రేణుకలకు 2014లో మరణశిక్ష కూడా విధించారు.

ఫోబియా (Phobia)

2016 లో విడుదలైన ఈ సినిమాకు పవన్ కిర్ పలానీ దర్శకత్వం వహించాడు. నెక్ట్స్ జెన్ ఫిలిమ్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ల పై సునీల్ లుల్లా, విక్కీ రజనీ దీనిని నిర్మించారు.  ఈ సినిమాలో రాధిక ఆప్టే, సత్యదీప్ మిశ్రా, అంకూర్ వికల్, యశస్విని దయామా ప్రధాన పాత్రల్లో నటించారు. శృంగార తార రాధిక ఆప్టే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ మానసికంగా కుంగిపోయే ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతుంది. తీవ్రమైన లైంగిక హింస కారణంగా, వాళ్ళు ఎదుర్కొనే ఫోబియాతో స్టోరీ మొదలవుతుంది.

చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ (Chup: Revenge of the artist)

దుల్కర్ సల్మాన్ సన్నీలియోన్ శ్రేయ ధన్వంతరి పూజ బట్ ఇందులో నటించారు. ముంబై వేదికగా సినీ విమర్శకులను టార్గెట్ చేస్తూ హత్యలు జరుగుతుంటాయి. ఈ విమర్శకులు అవినీతిపరులుగా ఉంటారు. చివరి వరకు ఈ మూవీ సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది.

బారోట్ హౌస్ (Barot house)

ఈ స్టోరీ ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అమిత్ బారోట్ అతని భార్య భావన మానసికంగా కృంగిపోతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు హత్యకు గురవుతారు. ఈ హత్యలు చేసింది ఎవరు? ఈ ఫ్యామిలీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందనేదే స్టోరీ ప్రధాన అంశం.

Also Read : మొదటి రాత్రే పైకి పోయే పెళ్లి కొడుకు … ప్రియుడి ఆత్మతో గందరగోళం… మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×