HBD Sindhu Menon:సింధు మీనన్ (Sindhu Menon).. ‘చందమామ’ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తో పాటు నటించి, తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రాణి అనే మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా ఒదిగిపోయింది. ఇక్కడ ప్రతి సన్నివేశంలో కూడా తన మార్క్ చూపించింది సింధు మీనన్. ఈ ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ రాణి లాంటి క్రేజీ క్యారెక్టర్ మాత్రం ఈమె ఖాతాలో పడలేదు.
ఇకపోతే ఈరోజు సింధు మీనన్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే క్రమంలో ఈమె ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏం చేస్తోంది? సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తుందా? అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి సింధు మీనన్ ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభం..
సింధు మీనన్ కన్నడ ఇండస్ట్రీకి చెందినవారు. చిన్నతనంలోనే డాన్సర్ అవ్వాలనుకున్న ఈమె భరతనాట్యం కూడా నేర్చుకుంది. అదే సమయంలో 1994లో ‘రష్మీ’ అనే కన్నడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం లభించడంతో.. ఆ వైపుగా అడుగులు వేసింది. ఈ సినిమా తర్వాత మళ్లీ రెండేళ్లకు ‘హులియా’ అనే మరో కన్నడ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే నటించింది. ఈ సినిమా సింధు మీనన్కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మంచి పాపులారిటీ అందుకుంది.
భద్రాచలం సినిమాతో హీరోయిన్గా తొలి అడుగు..
ఇక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్న సింధు మీనన్.. శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో తొలిసారి తెలుగు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో వరుస ఆఫర్లు పలకరించాయి. అలా త్రినేత్రం, శ్రీరామచంద్రులు, అదంతే అదో టైం అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ ఏవి కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించలేదు.
చందమామ సినిమాతో భారీ పాపులారిటీ..
ఇక ఆ తర్వాత కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత రెయిన్బో, సిద్ధం, వైశాలి వంటి సినిమాలు చేసింది. చివరిగా మలయాళం లో కూడా నటించింది. అలా సౌత్ లోని అన్ని భాషల్లో కలిపి 40 కి పైగా సినిమాలలో నటించిన ఈమె.. వంశం, కార్తీక అనే రెండు మలయాళ సీరియల్స్ లో మెయిన్ లీడ్ పోషించింది. ఇక తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
ALSO READ:Nivetha Thomas: నివేదా నిజంగానే అలాంటి సమస్యతో బాధపడుతోందా.. అసలు కారణం?
సింధు మీనన్ ఇప్పుడు ఎక్కడుందంటే?
2010లో డామినిక్ ప్రభు అనే ఐటీ ప్రొఫెషనల్ ను వివాహం చేసుకున్న ఈమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లో సెటిల్ అయిపోయింది సింధు మీనన్. ఇక అక్కడి నుంచి అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.