Ashwin Ball Tampering: భారత జట్టులో అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇక ప్రస్తుతం అశ్విన్ ఐపీఎల్ ఆడుతున్నాడు. అలాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోను యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఈ లీగ్ లో దుండిగల్ డ్రాగన్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు అశ్విన్.
Also Read: Triple Super Over: ఇదెక్కడి మాస్ రా…ఒకే మ్యాచ్ లో 3 సూపర్ ఓవర్లు.. కానీ చివరికి..
అయితే ఈ మధ్య తన ఆట తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ లీగ్ లోని మొదటి మ్యాచ్ లో అవుట్ ఇచ్చిన మహిళ ఎంపైర్ పై ఫ్రస్టేషన్ చూపిస్తూ బ్యాట్ విసిరేసిన అశ్విన్.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అశ్విన్ పై తమిళనాడు ప్రీమియర్ లీగ్ {TNPL} లోని టీం సంచలన ఆరోపణలు చేసింది. తన జట్టు అయిన దుండిగల్ డ్రాగన్స్ తో కలిసి అశ్విన్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డాడని మధురై పాంథర్స్ జట్టు బీసిసిఐ కి ఫిర్యాదు చేసింది.
అశ్విన్ జట్టు ఉపయోగించిన టవల్స్ ని ఏవో కెమికల్స్ లో ముంచి తీసుకువచ్చారని, దీంతో బంతి బరువు పెరిగిందని మధురై జట్టు ఆరోపించింది. ఈ నెల 14వ తేదీన మధురై పాంథర్స్ – దుండిగల్ డ్రాగన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డ్రాగన్స్ జట్టు ఆటగాళ్లు రసాయనాల్లో ముంచిన టవళ్లతో బంతిని పదేపదే తుడిచారని, తద్వారా బంతి బరువు పెంచాలని ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బంతిని బ్యాట్ తో కొట్టినప్పుడు స్టీల్ బంతిని కొట్టినట్లుగా శబ్దం వచ్చిందని మధురై పాంథర్స్ జట్టు ఫిర్యాదు చేసింది.
పదేపదే హెచ్చరించినప్పటికీ దుండిగల్ జట్టు బంతిని ట్యాంపరింగ్ చేస్తూనే వచ్చిందని మధురై పాంథర్స్ జట్టు సీఈఓ డి.పూజ తమిళనాడు ప్రీమియర్ లీగ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించి తమిళనాడు ప్రీమియర్ లీగ్ అధికారులు బాల్ ట్యాంపరింగ్ జరిగిందా..? లేదా..? తేల్చేందుకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా ఆరోపణలపై టిఎస్పిఎల్ సిఈఓ ప్రసన్న కన్నన్ స్పందించారు.
Also Read: Mark Taylor-kohli: ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విరాట్ కోహ్లీ సీక్రెట్ రిలేషన్?
” మధురై పాంథర్స్ జట్టు ఫిర్యాదు చేసిన దాన్ని మేము స్వీకరించాము. రూల్స్ ప్రకారం మ్యాచ్ జరిగిన 24 గంటలలోపు ఫిర్యాదు చేయాలి. కానీ మదురై అలా చేయకపోయినప్పటికీ మేము ఫిర్యాదును స్వీకరించాం. ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించారని కోరాం. ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆరోపణలలో నిజా నిజాలు తేలుస్తాం. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక ప్లేయర్ ని, ఫ్రాంచైజీని టార్గెట్ చేయడం సరైనది కాదు. ఒకవేళ ఆధారాలు చూపించలేకపోతే మధురై జట్టుపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.