Nivetha Thomas:ప్రముఖ కోలీవుడ్ ముద్దుగుమ్మ నివేదా థామస్ (Nivetha Thomas) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా పలు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. ఛాలెంజింగ్ పాత్రల్లో కూడా మెరిసిన ఈమె.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ వేడుకకు హాజరై అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అత్యంత బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే సడన్గా ఇలా బరువు పెరగడం పట్ల అభిమానులు కంగారుపడుతూ అసలు కారణం ఏంటి ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈమె ఆరోగ్య విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు అందుకున్న నివేదా థామస్..
నివేదా థామస్.. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఈమె.. 2008 నుంచి సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా తమిళ్ , మలయాళం చిత్రాలతో రెండు భాష ఇండస్ట్రీలకు పరిచయమైన ఈమె.. 2016లో నాచురల్ స్టార్ నాని (Nani ) హీరోగా నటించిన ‘నిన్ను కోరి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా తర్వాత ‘ జెంటిల్మెన్’ సినిమాలో కూడా నటించింది. ఇక నిన్ను కోరి సినిమాతో భారీ పాపులారిటీ లభించడంతో.. జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, వీ, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇక రెజీనా కసాండ్రా (Regina Cassandra)తో కలిసి ‘ షాకిని డాకినీ’ లో నటించిన ఈమె.. చివరిగా ‘ 35: ఇది చిన్న కథ కాదు’ అనే చిత్రంలో నటించింది. ఇందులో తన నటనతో అందరినీ మెప్పించింది. అంతేకాదు ఇందులో ఉత్తమ నటిగా గద్దర్ అవార్డు అందుకుంది నివేదా థామస్.
నివేదా బరువు పెరగడం వెనక కారణం అనారోగ్య సమస్యలా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15వ తేదీన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించిన చిత్రాలకు అన్ని కేటగిరీలలో అవార్డులను ప్రధానం చేశారు. ఈ క్రమంలోని నివేదాకి కూడా అవార్డు వచ్చింది.ఈ అవార్డును స్వీకరించేందుకు స్టేజ్ పైకి ఎక్కిన ఈమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ చీరలో అచ్చ తెలుగు అమ్మాయిల మెరిసింది.అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ ఈమె చాలా బరువు పెరిగిపోయి కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈమెకు థైరాయిడ్ ఉందని, ఆ అనారోగ్య సమస్య వల్ల ఇలా బరువు పెరిగిపోయిందని కామెంట్లు చేశారు.
అసలు ఏం జరిగిందంటే?
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. 35 చిత్రంలో తల్లి పాత్ర కోసమే నివేదా థామస్ అప్పట్లో బరువు పెరిగిందని, అప్పుడు బరువు పెరిగిందే కానీ ఇప్పుడు తగ్గడం కష్టంగా మారిందని సమాచారం. ముఖ్యంగా తన బాడీ ట్రాన్స్ఫార్మ్తో న్యాయం చేశానని కూడా గతంలో ఈమె తెలిపింది. ఇక బరువు పెరగడానికి రీసన్ మాత్రం 35 సినిమా అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అనుష్క శెట్టి (Anushka Shetty) లాగా ఈమె కూడా సినిమా కోసం బరువు పెరిగిపోయి ఇప్పుడు బరువు తగ్గడం కష్టంగా మారిపోయిందంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Film industry: ఈ పాపాయి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోందని మీకు తెలుసా?