BigTV English
Advertisement

Dhee Movie Re-Release :  రీ రిలీజ్ ట్రెండ్‌లోకి మంచు వారసుడు… సరిగ్గా కన్నప్పకు ముందే ఎందుకు?

Dhee Movie Re-Release :  రీ రిలీజ్ ట్రెండ్‌లోకి మంచు వారసుడు… సరిగ్గా కన్నప్పకు ముందే ఎందుకు?

Dhee Movie Re-Release : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ హీరోలు నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే . గత రెండు సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున సినిమాలు రీ రిలీజ్ (Re Release)అవుతూ మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా మొదట్లో విడుదల చేసినప్పటికంటే రీ రిలీజ్ అయ్యి మంచి ఆదరణ రాబడుతుంది. అయితే తాజాగా మరొక సినిమా కూడా రీ రిలీజ్ అవ్వటానికి సిద్ధమవుతుంది..


రీ రిలీజ్ కు సిద్ధమైన ఢీ….

సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న వారిలో మంచు విష్ణు(Manchu Vishnu) ఒకరు. ఈయన తన కెరీయర్ లో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇలా మంచు విష్ణు సక్సెస్ అందుకున్న సినిమాలలో ఢీ సినిమా(Dhee Movie) ఒకటి. మంచు విష్ణు , జెనీలియా హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13, 2007వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. సిరి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.


రీ రిలీజ్ ప్రమోషన్లలో భాగమేనా….

ఈ సినిమాలో దివంగత నటుడు శ్రీహరి, చంద్రమోహన్, సునీల్, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. 2007వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా తిరిగి జూన్ 6వ తేదీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయటానికి సిద్ధమయింది. ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

ఇన్ని రోజులపాటు ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని చిత్ర బృందం అసలు భావించలేదు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా (Kannappa Movie) విడుదల సమయంలోనే ఈ సినిమాని ఎందుకు తిరిగి విడుదల చేయాలనుకుంటున్నారని ప్రేక్షకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కన్నప్ప సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడుతున్నానని తెలిపారు. అయితే ఈ సినిమా ఈనెల 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలందరూ కూడా భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి ఢీ రీ రిలీజ్ కన్నప్ప సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×