BigTV English

Nita Ambani Costly Car: ఖరీదైన కారు కొన్న నీతా అంబానీ.. ధర చూస్తే షాక్!

Nita Ambani Costly Car: ఖరీదైన కారు కొన్న నీతా అంబానీ.. ధర చూస్తే షాక్!
Nita Ambani
Nita Ambani

Nita Ambani Bought a Personalized Rolls Royce Phantom Car:  భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో అంబానీ కుటుంబం కూడా ఒకటి. అంబానీలు వారి విలాసవంతమైన జీవనశైలి విషయంలో తరచూ వార్తల్లో ఉంటారు. వారి లైఫ్​స్టైల్​ ధనికులకు ఒక బెంచ్​మార్క్​గా ఉంటుంది. అయితే ప్రసిద్ధి చెందిన జియో గ్యారేజీలో ఒక కొత్త కారు వచ్చి చేరింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ.. పర్సనలైజ్డ్​ రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రత్యేకమైన రోజ్ క్వార్ట్​జ్​ షేడ్​లో తయారు చేశారు. ఈ లగ్జరీ కారు ఎంత ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం.


నీతా అంబానీ కొనుగోలు చేసిన కొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ ఫాంటామ్ ఫోటోలు చూస్తుంటే కారు చాలా విశాలవంతంగా ఉంది. అంతేకాకుండా  విలాసవంతమైన లిమోసిన్‌ను అద్భుతమైన రంగు స్కీమ్‌లో, ఆర్చిడ్ వెల్వెట్‌తో పూర్తి చేసిన ఇంటీరియర్‌‌లో కనిపిస్తుంది. హెడ్‌రెస్ట్‌లో ‘నీతా ముఖేష్ అంబానీ’ అనే అక్షరాలు ఎంబ్రాయిడరీ చేయబడ్డాయి. అయితే ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ’ బంగారంతో చెక్కబడి ఉంది. ఫాంటమ్‌పై అమర్చిన డిన్నర్ ప్లేట్ వీల్స్ గ్రాండ్ లుక్‌ను చూపిస్తున్నాయి.

Also Read: క్రేజీ డీల్.. టాటా పంచ్ EVపై భారీ డిస్కౌంట్


ఇంజిన్, స్పెసిఫికేషన్లు

Rolls-Royce ఫాంటమ్ 8 EWB 6.75-లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 571 bhpతో 900 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇ. EWB క్యాబిన్ కారుకు అదనపు స్పేస్ ఇస్తుంది. అయితే స్టార్ హెడ్‌లైనర్ క్యాబిన్ కొత్తగా డిజైన్ చేశారు.

ధర

నీతా అంబానీ కొత్త రోల్స్ రాయిస్ ధరపై అధికారికంగా వెల్లడికాలేదు. అయితే భారతదేశంలో దీని ధరలు సగటున రూ. 12 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఇది నీతా అంబానీ మొదటి రాయిస్ రోల్స్ కాదు. అంబానీ గ్యారేజ్‌లో ఇటువంటివి బోలేడు ఉన్నాయి.

Also Read: అమ్మకాల్లో అదరగొడుతున్న హ్యుందాయ్ క్రెటా!

గత ఏడాది దీపావళి సందర్భంగా నీతాకు భర్త ముఖేష్ అంబానీ బ్లాక్ రోల్స్ రాయిస్ కల్లినన్‌ను బహుమతిగా ఇచ్చారని సమాచారం. కొత్త రోల్స్ రాయిస్ కార్లతో పాటు, జియో గ్యారేజ్‌లో కొత్త ఫెరారీ పురోసాంగ్యూ, ఆర్మర్డ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మరియు కొత్త తరం రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబి వంటి లగ్జరీ వెహికల్స్ ఉన్నాయి.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×