BigTV English

Update on F3 Movie: ఎఫ్ 3 కాంబో.. ఇక అధికారికం!

Update on F3 Movie: ఎఫ్ 3 కాంబో.. ఇక అధికారికం!
Victory Venkatesh - Dil Raju - Anil Ravipudi Combo
Victory Venkatesh – Dil Raju – Anil Ravipudi Combo

Victory Venkatesh – Dil Raju – Anil Ravipudi Combo: విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.ఇంకోపక్క రానా నాయుడు సిరీస్ తో వెంకీ మామ కొంత నెగెటివీటిని అందుకున్నాడు. అయినా కూడా రానా నాయుడు సీజన్ 2 కూడా మొదలుపెట్టాడు. ఇవి కాకుండా గత కొన్నిరోజులుగా వెంకటేష్.. అనిల్ రావిపూడితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబో హ్యాట్రిక్ కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.


ఉగాది పండుగవేళ ఈ కాంబోను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కొత్త సినిమా మొదలుకానుందని తెలిపారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడం విశేషం. వెంకటేష్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. “మళ్లీ అనిల్ తో మంచి చిత్ర బృందంతో వస్తున్నా.. హ్యాపీ ఉగాది” అంటూ రాసుకొచ్చాడు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ వీడియోలో ఎక్స్ కాప్ .. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఎక్సలెంట్ వైఫ్ అంటూ చెప్తూ.. ఇంకా ఎక్స్జైటింగ్ వివరాలు త్వరలోనే రివీల్ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను బట్టి చూస్తుంటే కథలో చాలా డెప్త్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదొక ట్రయాంగిల్ క్రైమ్ కథగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం.. వెంకీ మామతో మంచి సినిమా తీయండి అంటూ అనిల్ కు సలహాలు ఇస్తున్నారు.


Also Read: Kalki2898AD: ఓరి మీ దుంపతెగ.. సడెన్ గా చూసి అఫిషియల్ అనుకున్నాం కదరా..

ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు కాకుండా మంచి కామెడీతో పాటు వెంకీ మామ ఎమోషనల్ కూడా వాడుకోండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ అందుకుంటుందో లేదో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×