RC 16 Movie Story : గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పుడిప్పుడే రామ్ చరణ్ అభిమానులు కోలుకుంటున్నారు. గేమ్ ఛేంజర్‌తో నిరాశపడినా… వాళ్ల ముందు ఉన్న హోప్… బుచ్చిబాబు. ఉప్పెన సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్‌తో RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. షూటింగ్ ఇప్పడికే స్టార్ట్ అయింది. అయితే, ఈ మూవీ స్టోరీ ఏంటి… కనీసం ఏ లైన్‌పై చేస్తున్నారు అనేది ఉత్కంఠగా మారింది. విలేజ్ బ్యాగ్రౌండ్‌లో మూవీ వస్తుందని తెలుస్తుంది. కానీ, స్టోరీ ప్లాట్ ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ తెలీదు. అయితే తాజాగా ఈ సినిమా లైన్ ఇదే అని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
బుచ్చిబాబు కొత్త డైరెక్టరే. కానీ, ఎప్పుడూ అలాంటి కోణంతో చూడటం లేదు. ఎందుకంటే… క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కి శిష్యుడు ఈ బుచ్చిబాబు. చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీకి కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కీ రోల్ చేశాడు. అందుకే కాబోలు… రామ్ చరణ్ ఈ RC 16 ఛాన్స్ ఇచ్చాడు.
RC 16 (పెద్ది) స్టోరీ లైన్ ఇదే…?
గేమ్ ఛేంజర్‌తో డీలా పడిపోయిన ఫ్యాన్స్ ముందు ఉన్న ఏకైక ఆశ ఈ RC 16. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా నటీనటులు కూడా దీనిలో భాగం అవుతున్నారు. అలాంటి సినిమాపై అంచనాలు ఉండటం చాలా కామన్. అలానే… ఈ RC 16పై భారీ హైప్ ఉంది. అయితే… ఈ సినిమా స్టోరీ దేని గురించి ఉంటుందో అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ క్లారిటీ రాలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ మూవీ క్రికెట్ గురించి ఉంటుందని తెలుస్తుంది. విలేజ్‌లో ఆడే గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని గల్లీ క్రికెట్ ఆడుతరట. గల్లీ క్రికెట్.. ఆ క్రమంలో వచ్చే ఆధిపత్య పోరుతో సినిమా ఉంటుందని తెలుస్తుంది.
రత్నవేలు కూడా హింట్ ఇచ్చాడు…
ఈ విషయాన్నే హింట్ ఇచ్చాడు సినిమాటోగ్రఫర్ రత్నవేలు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. RC 16 సెట్స్ నుంచి తీసిన ఓ ఫోటోను పెట్టి… “నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో RC 16 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న పెద్ది మూవీ క్రికెట్ నేపథ్యంలోనే వస్తుందని కన్ఫామ్ అయిపోయింది.
కాగా, ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు జగపతి బాబు కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. వీరితో పాటు మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేం దివ్యాందు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఆయనకు ఇదే మొదటి తెలుగు చిత్రం.