BigTV English

Boycott Laila : కొంపముంచిన పృథ్వి… ‘లైలా’ సినిమా బాయ్ కాట్?

Boycott Laila : కొంపముంచిన పృథ్వి… ‘లైలా’ సినిమా బాయ్ కాట్?

Boycott Laila : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని మాస్ యాక్షన్ సన్నీ వేశాలతో కూడినవే.. గత ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాకీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. మెకానిక్ రాకీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మిగిలిన రెండు సినిమాలు మంచి హిట్ ని సొంతం చేసుకున్నాయి. అదే కాదు బాక్సాఫీస్ దగ్గర గామి మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ ఏడాది లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 14 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ మేరకు ఆదివారం సాయంత్రం హైదరాబాదులో గ్రాండ్ గా లైలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరయ్యారు.. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన స్పీచ్ హైలెట్ అయ్యింది. అలాగే ప్రముఖ నటుడు పృథ్వి సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి..


లైలా ఈవెంట్ లో నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇందులో నేను మేకల సత్యం అనే క్యారక్టర్ లో నటించానని అన్నారు. షూట్ జరిగేటప్పుడు ఒక సంఘటన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో 150 మేకలు ఉన్నాయని పృథ్వీ ఆయన పాత్ర గురించి వివరించారు.. ఒక సీన్లో నన్ను కట్టిపడేస్తారు. నా బామ్మర్దుల రాగానే నన్ను వదిలేస్తారు. ఆ తర్వాత మేకలి లెక్క పెడితే సరిగ్గా 11 ఉన్నాయి. ఏంటో మాకు అలా కలిసి వచ్చింది అని ఇండైరెక్టుగా వైసిపి పై సెటర్లు వేశారు పృథ్వీరాజ్.. ఇది కరెక్ట్ గా వైసీపీ కి గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల గురించి అని కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ పార్టీకి వచ్చిన 11 సీట్ల గురించి పృధ్విరాజ్ మాట్లాడడానికి సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. వెంటనే లైలా సినిమాను బైకాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బై కాట్ లైలా మూవీ అనే హ్యాస్టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది..

గతంలో జరిగిన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. ఐదేళ్ల తర్వాత 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగలిగింది. దీంతో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ ని ఉద్దేశించి చేసినవేనని తెలుస్తోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. పృథ్వీ వెంటనే క్షమాపణలు చెప్పాలని, మూవీ ఈవెంట్‌లో ఏ సంబంధం లేని రాజకీయాల గురించి ప్రస్తావించడం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు… పృథ్వీ రాజ్ చే సిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ‘boycott Laila’ పేరు తో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు వైసీపీ అభిమానులు.. మరో విచిత్రం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికి పృథ్విరాజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలలోను..అటు రాజకీయాలను చర్చనీయాంశంగా మారాయి.. ఈ వ్యాఖ్యల మీద ‘లైలా’ చిత్ర యూనిట్ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి, క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం…


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×