BigTV English

Pushpa 2 Movie : అల్లు అర్జున్ సౌత్‌లో సాధించాడా..? ఈ రాష్ట్రాల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

Pushpa 2 Movie : అల్లు అర్జున్ సౌత్‌లో సాధించాడా..? ఈ రాష్ట్రాల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

Pushpa 2 Movie :ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun)అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా 2021 లో సుకుమార్(Sukumar )దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ కి ‘పుష్ప’ సినిమా ఏ రేంజ్ లో గుర్తింపు అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ పాపులారిటీ పెరిగిపోయింది. పుష్ప సినిమా తీసుకొచ్చిన క్రేజ్ పుష్ప 2 సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేపట్టారు అల్లు అర్జున్.ఒక నార్త్ లోనే కాకుండా సౌత్ లో కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా పుష్ప -2 కోసం ఎదురు చూడగా ఈరోజు డిసెంబర్ 5 ఎట్టకేలకు సినిమా విడుదల అయింది.


సౌత్ ఆడియన్స్ రియాక్షన్..

ఇకపోతే కన్నడ, మలయాళం, కేరళ లో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? పుష్ప రాజ్ ప్రేక్షకులను మెప్పించారా..? అసలు బజ్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫహాధ్ పాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. హై బజ్ తో వచ్చిన పుష్ప -2 సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు..ఇకపోతే సౌత్ ఆడియన్స్ రియాక్షన్ విషయానికి వస్తే.. ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నట్లు సమాచారం.


మిక్స్డ్ టాక్..

విడుదలైన మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ తన పాత్రలో ప్రాణం పెట్టి మరీ నటించేశారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో ఆయన పెర్ఫార్మన్స్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి. రష్మిక.. పుష్పరాజ్ భార్య శ్రీవల్లి క్యారెక్టర్ లో నటించి పక్క హౌస్ వైఫ్ మెటీరియల్ అని నిరూపించుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో సుకుమార్ ఇంటెలిజెన్స్ చాలా క్లియర్ గా కనిపించింది.

పుష్ప 2 ప్లస్, మైనస్ లు ఇవే..

ఇకపోతే సౌత్ ఆడియన్స్ ఈ సినిమాలో కొన్ని ప్లస్, మైనస్లు కూడా బయటపెట్టారు.. ముఖ్యంగా ఈ సినిమాకి సుకుమార్ డైరెక్షన్, పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్తో పాటు ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. క్యూబా సినిమాటోగ్రఫీ మార్క్ కనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో సుకుమార్ మార్క్ మిస్సయింది. విలన్ క్యారెక్టర్ కూడా బలహీనంగా అనిపించింది. ఇక కొన్ని సన్నివేశాలు ల్యాగ్ గా అనిపించాయి.మొత్తానికి అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి కలెక్షన్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ ను అంచనా వేయవచ్చని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×