Padma Awards 2025 : ఈ ఏడాది పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో పలువురు నటులకు పద్మ అవార్డ్స్ వరించాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల్లో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ వరించింది.
2025 పద్మ అవార్డ్స్ కు పలువురు నటులు ఎంపికయ్యారు. కళా రంగం నుంచి తమిళ హీరో అజిత్, నటి శోభన, బాలీవుడ్ నటుడు శేఖర్ కపూర్ , కన్నడ నటుడు అనంతనాగ్, జతిన్ గోస్వామి (అస్సాం) కు పద్మ అవార్డ్స్ వచ్చాయి.
హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో. తమిళంతో పాటు తెలుగులో సైతం మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు పాత్రలల్లో అలరించారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అటు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో.. కార్ రేసింగ్ లో సైతం దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ లో విజయం సాధించాడు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.
నటి శోభ (Shobha).. విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. నాగార్జున నటించిన తొలి సినిమా ఇదే. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన శోభన… చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి సినిమాల్లో నటించింది. వెంకటేష్ తో అజేయుడు, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, గేమ్ లాంటి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన శోభ క్లాసికల్ డ్యాన్సర్ గా మంచి పేరు సంపాదించుకుంది.