BigTV English

Srisatya: ఆయన కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.. ఆ అదృష్టం కోసం వేచి చూస్తున్నాను

Srisatya: ఆయన కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.. ఆ అదృష్టం కోసం వేచి చూస్తున్నాను

Srisatya: అందాల భామలు అందరూ వెండితెరపై మీదనే కాదు బుల్లితెరలో కూడా కనిపిస్తారు అని శ్రీసత్య లాంటి ముద్దుగుమ్మలను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. శ్రీసత్య.. సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ తన గేమ్ తో అదరగొట్టి తనకంటూ ఫ్యాన్స్  ను సంపాదించుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చాకా శ్రీసత్య వరుసగా డ్యాన్స్ షోస్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది.


ఇక తాజాగా  శ్రీసత్య, మెహబూబ్  జంటగా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. నువ్వే కావాలి అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కోసం మెహబాబ్ దాదాపు రూ. 50 లక్షలు వరకు ఖర్చుచేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో శ్రీసత్య తాను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిందో చెప్పుకొచ్చింది.

శ్రీసత్యకు హీరో రామ్ పోతినేని అంటే చాలా ఇష్టమని అందరికీ తెల్సిన విషయమే. ఆమె ఎన్నోసార్లు ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది. అంతెందుకు ఆమె టాలీవుడ్ ఎంట్రీ కూడా రామ్  సినిమాతోనే చేసింది.  నేను శైలజ సినిమాలో రామ్ కు బ్రేకప్ చెప్పే అమ్మాయిగా శ్రీసత్య  కనిపించింది. ఇక ఆ తరువాత సీరియల్స్ లోకి వచ్చి.. ఇప్పుడు స్టార్ గా మారింది.


Nandamuri Balakrishna: బ్రేకింగ్.. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్

ఇక తాజాగా రామ్ తో మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు అన్న ప్రశ్నకు సత్య మాట్లాడుతూ.. ” రామ్ పోతినేని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను. మళ్లీ ఆయనతో కలిసి నటించే అదృష్టం కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

అందం, అభినయం ఉన్న నటీమణుల్లో శ్రీసత్య ఒకరు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాకా.. సినిమాల్లో కూడా ఆమెకు మంచి పాత్రలు వస్తున్నాయి.  టిల్లు స్క్వేర్ లో తనకు మంచి పాత్ర వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. కానీ, సినిమాలో ఒక సింగిల్ షాట్ కే ఆమె పరిమితమయ్యింది. ఎడిటింగ్ లో సత్య సీన్స్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై శ్రీసత్య చాలా బాధపడింది. ఆ పాత్ర కనుక క్లిక్ అయ్యి ఉంటే అమ్మడికి మంచి గుర్తింపు వచ్చేది. ప్రస్తుతం శ్రీ సత్య కొన్ని సినిమాల్లో  కీలక పాత్రల్లో నటిస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×