BigTV English

Akash Jagannadh: తల్వార్‌తో రచ్చ చేయబోతున్న ఆకాష్ పూరీ

Akash Jagannadh: తల్వార్‌తో రచ్చ చేయబోతున్న ఆకాష్ పూరీ

Hero Akash Puri Is Going To Make A Fuss With Talwar: టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు చెప్పగానే ఇట్టే గుర్తుపడుతారు టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్. ఇక తన తనయుడు ఆకాష్ జగన్నాథ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే తాను చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుజ్జి మూవీలో నటించి టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. హీరోగా మారి ఇప్పుడిప్పుడే ఆకాష్ సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. అయితే అతడు ఎదురుచూస్తున్న సూపర్ హిట్ సక్సెస్ మాత్రం ఇంకా తనకి తారసపడటం లేదు.


ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా కాశి పరశురామ్ డైరెక్షన్‌లో రాబోయే లేటెస్ట్‌ మూవీ తల్వార్. ఈ మూవీలో ఆకాష్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్. అంతేకాకుండా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఇంటెన్స్ పోస్టర్‌లో ఆకాష్‌ని వన్‌సైడ్‌ నుంచే రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు మూవీ యూనిట్.

Also Read: ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న బ్రహ్మాఆనందం గ్లింప్స్‌


ఈ సినిమా ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిపారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ క్లాప్‌ కొట్టగా హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ అందించారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్ చేయగా.. బుచ్చిబాబు ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించినారు.ఇక ఈ మూవీని వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేశవ కిరణ్ ఈ మూవీకి బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని అందించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్‌ను అతి త్వరలోనే అనౌన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఈ మూవీ గతంలో ఆకాష్ చేసిన సినిమాలు కాకుండా ఇది కంప్లీట్‌గా వాటిని మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.అందుకే ఆకాష్ అంత టైమ్ తీసుకున్నాడంటూ నెట్టింట రకరకాల చర్చలు జరుపుకుంటున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఈ మూవీతో ఆకాష్ సక్సెస్ ట్రాక్‌ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×