Minister Pregnant With Teenager| రాజకీయంగా ఉన్నతపదువుల్లో ఉన్న ఒక మహిళ ఒక టీనేజ్ అబ్బాయిని ప్రేమించింది. నిస్సహాయ స్థితిలో ఉన్న అతడు సాయం కోరి వస్తే అతడితో తన కామ వాంఛను తీర్చుకుంది. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి ఆమె రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఐస్ లాండ్ దేశంలో జరిగింది.
ఐస్లాండ్ విద్యా, శిశు సంక్షేమ మంత్రి ఆస్తిల్డర్ లోవా థోర్సోడొట్టిర్ (Asthildur Loa Thorsdottir), దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక టీనేజ్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఫలితంగా, ఆస్తిల్డర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
58 ఏళ్ల వయసు ఉన్న ఆస్తిల్డర్ లో మూడు దశాబ్దాల క్రితం ఒక మతపరమైన సామాజిక సంస్థలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆస్తిల్డర్ వయసు 23. అదే సమయంలో అక్కడికి దీన స్థితిలో శరణు కోరి ఒక 16 ఏళ్ల బాలుడు వచ్చాడు. అతని పేరు అస్ముండ్సన్. ఆ బాలుడి కష్టాల్లో ఉన్నాడని తెలిసి అతనికి ఆ సంస్థ కౌన్సిలింగ్ కోసం ఆస్తిల్డర్ వద్దకు పంపింది. దీంతో ప్రతి రోజు ఆస్తిల్డర్, అస్ముండ్సన్ కలుసుకునేవారు. అస్ముండ్సన్ కష్టాలు విని అతనికి మానసికంగా ధైర్యం చెప్పే క్రమంలో ఆమె అతనికి దగ్గరైంది. అతనితో ప్రేమలో పడింది.
Also Read: చైనాతో అమెరికా యుద్ధం.. రక్షణ శాఖ రహస్యాలు త్వరలో ఎలాన్ మస్క్‌కు వెల్లడి?
మరోవైపు, అస్ముండ్సన్ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. తన బిడ్డను చూడాలనే కోరికతో అతను చాలా కాలం ప్రయత్నించాడు, కానీ ఆస్తిల్డర్ అతడిని అనుమతించలేదు. ఈ విషయాలన్నీ అస్ముండ్సన్ ఇటీవల మీడియాకు వెల్లడించాడు. దీంతో ఆస్తిల్డర్ గతం గురించి అందరికీ తెలిసిపోయింది. “బిడ్డ పుట్టిన సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఒక సంవత్సరం వరకు వారితో కలిసే ఉన్నా. కానీ, ఆ తర్వాత నా కుమారుడిని ఆమె కలవనివ్వలేదు. అతడి కోసం న్యాయపోరాటం చేశా. 18 ఏళ్ల పాటు నా కుమారుడి సంరక్షణ కోసం డబ్బు చెల్లించాను. అయినప్పటికీ నా బిడ్డను కలిసేందుకు నేను చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ఆస్తిల్డర్ మమ్మల్ని కలవనివ్వలేదు. ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకొని సుఖంగా ఉంది. కానీ నా బిడ్డను మాత్రం నాకు దూరం చేసింది.” అని అస్ముండ్సన్ మీడియాకు తెలిపాడు.
ఇటీవల.. స్థానిక మీడియా ఆస్తిల్డర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో.. ఒక టీనేజ్ బాలుడితో మీరు ప్రెగ్నెంట్ అయ్యారా అని ప్రశ్నించగా.. ఆమె తన తప్పును అంగీకరించారు. “ఇది 30 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అప్పుడు నాకు 22 ఏళ్ల వయసు మాత్రమే ఉంది. నేను తెలీక తప్పు చేశాను” అని ఆమె చెప్పుకున్నారు.
ఐస్లాండ్ చట్టాల ప్రకారం.. ఒక మైనర్‌తో గురువు లేదా సంరక్షకులు వివాహేతర సంబంధం కలిగి ఉండటం నేరం. అలా చేసినవారికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయం ఇటీవల అస్ముండ్సన్ బంధువు ఒకరు దేశ ప్రధానమంత్రికి తెలియజేయడంతో, ఆమెకు తన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి గతంలో మైనర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉండటం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఫలితంగా, ఆస్తిల్డర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్లమెంటులో ఎంపీగా కొనసాగుతానని, తన పార్టీని వీడనని ఆమె తెలిపారు. కాగా, ఆమె ప్రస్తుత భర్తతో ఈ విషయంపై గొడవలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు ప్రచురించింది.