GV Prakash: కోలీవుడ్ స్టార్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ( Gv Prakash ) గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తూనే మరోవైపు హీరోగా వరుస సినిమాలను అనోన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన కెరియర్ పరంగా మంచి సక్సెస్ ని అందుకున్నారు కానీ ఈ మధ్య మాత్రం ఈయన పర్సనల్ లైఫ్ గురించి ఏదో ఒక వార్త వార్తలో హైలైట్ అవుతు వస్తుంది. ఆయన తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జీవి ప్రకాష్ అయితే కొన్నాళ్లు బాగానే కాపురం చేశారు ఈమధ్య వీరిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా? లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది తెలియలేదు కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. జీవి విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే అంటూ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
డైరెక్టర్ కమ్ హిరో జీవి విడాకులు తీసుకోవడానికి కారణం ఓ హీరోయిన్ అని ఈమధ్య వార్తలు వినిపిస్తున్నాయి.. ఓ హీరోయిన్ తో ఆయన డేటింగ్ లో ఉండడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చాడని గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జీవీ ప్రకాష్ తో పాటు రూమర్లు వినిపించిన సదరు హీరోయిన్ కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ హీరో ప్రస్తుతం కింగ్ స్టన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దివ్య భారతితో సెకండ్ టైం రొమాన్స్ చేయబోతున్నాడు ఈ హీరో. ఇదొక భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్. ఈ మూవీ మార్చి 7న థియేటర్లలో రిలీజ్ అవ్వబోతుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు మేకర్స్..
Also Read : RGV తో కృష్ణ వంశీ కి విబేధాలకు కారణం ఇదేనా ?
ఈ ప్రమోషన్లలో భాగంగా జీవీ ప్రకాష్ తన విడాకులపై వస్తున్న రూమర్లు, హీరోయిన్ దివ్య భారతి ( Divya Bharathi ) తో ఉన్న రిలేషన్ గురించి ప్రస్తావించారు.. వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.. అయితే ఈమెతో డేటింగ్ లో ఉన్నారని ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలు పై తాజాగా హీరో జీవి స్పందించారు.. మేము డేటింగ్ లో లేము ఈ సినిమాలోనే కలిసాం. ఈ సినిమా సెట్ లోనే మేము మాట్లాడుకున్నాం బయట ఏ రోజు కలిసింది లేదు.. సినిమా తర్వాత అంటే ఇప్పుడు ఇలా కలిసాం.. మేమిద్దరం కలిసి నటించిన బ్యాచిలర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అందులో మా ఇద్దరికి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి.. నిజం చెప్పాలంటే మాకు ఒకరికి మరొకరికి అసలు సంబంధం లేదంటూ జీవి క్లారిటీ ఇచ్చారు.. ఆ తర్వాత ఇదే విషయం పై హీరోయిన్ మాట్లాడుతూ.. వారిద్దరూ విడిపోవడానికి కారణం తనే అనే నిందను భరించాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని హీరోయిన్ దివ్య భారతి అన్నారు.. అతను విడాకులు తీసుకోవడానికి కారణం నేనే అంటూ ఆ తర్వాత నా మీద పడ్డారు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఆమె తెలిపారు. జీవీ ప్రకాష్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన ఫస్ట్ మూవీ బ్యాచిలర్ . ఈ సినిమాలోని అదియే సాంగ్ దుమ్మురేపింది.. ఆ మూవీ తర్వాత రెండో సినిమాగా కింగ్ స్టన్ రాబోతుంది. ఈ జోడి రిపీట్ అవ్వడంతోనే డేటింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్లు సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.