BigTV English

Krishna Vamshi: RGV తో కృష్ణ వంశీ కి విబేధాలకు కారణం ఇదేనా ?

Krishna Vamshi: RGV తో కృష్ణ వంశీ కి విబేధాలకు కారణం ఇదేనా ?

Krishna Vamshi: డైరెక్టర్ కృష్ణ వంశీ ( Krishna Vamshi) గురించి తెలుగు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలను అందించారు. ఈయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) అసిస్టెంట్ గా పనిచేసారు. 1995 రొమాంటిక్ క్రైమ్ చిత్రం గులాబీ తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . 1996 లో, అతను నిన్నే పెళ్లాడతా చిత్రానికి దర్శకత్వం వహించాడు , ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తర్వాత అతను తన నిర్మాణ సంస్థ ఆంధ్రా టాకీస్‌లో విమర్శకుల ప్రశంసలు పొందిన సింధూరం కి దర్శకత్వం వహించాడు. ఈ మధ్య ఈయన రంగమార్తండా మూవీని తెరకెక్కించారు. ఈ డైరెక్టర్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ తో విబేధాలు పై క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతుంది..


కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమాలు..

తెలుగు స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. 1995 రొమాంటిక్ క్రైమ్ చిత్రం గులాబీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు .1996లో, అతను నిన్నే పెళ్లాడతా చిత్రానికి దర్శకత్వం వహించాడు , ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తర్వాత అతను తన నిర్మాణ సంస్థ ఆంధ్రా టాకీస్‌లో విమర్శకుల ప్రశంసలు పొందిన సింధూరం కి దర్శకత్వం వహించాడు. రెండు చిత్రాలు తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాయి  కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఇతర ముఖ్యమైన చిత్రాలలో అంతఃపురం , మురారి , ఖడ్గం , డేంజర్, చందమామ , మహాత్మ , గోవిందుడు అందరివాడేలే , మరియు రంగమార్తాండ ఉన్నాయి.. అయితే ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి సంచలన విషయాలను బయట పెట్టారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.


Aslo Read : ‘బాహుబలి’ చేసి తప్పు చేశాను.. అయ్యో ఏమైందన్నా..?

రామ్ గోపాల్ వర్మ తో విబేధాలు పై క్లారిటీ..

డైరెక్టర్ కృష్ణ వంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన సినిమాల గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే రాంగోపాల్ వర్మతో మీకు విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి అందులో నిజం ఎంత ఉందని ఇంటర్వ్యూలో అడిగారు. దానికి ఆయన మాట్లాడుతూ.. విభేదాలని ఎప్పుడూ అనుకోలేదు చిన్న మనస్పర్ధలు వచ్చాయి అని క్లారిటీ ఇచ్చారు. అయినా పెద్ద డైరెక్టర్ అయితే అనగనగా ఒక రోజు సినిమా విషయంలో నేను ఇలా చేద్దాం అంటే ఆయన అలా చేద్దామని అన్నారు. దాంతో ఇద్దరి మధ్య కాస్త మనస్పర్థలు వచ్చాయి అంతేతప్ప విభేదాలు గొడవలు ఎక్కడ జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా సినిమాలు చేయడం మొదలు పెట్టాను. ఆ సినిమాలు హిట్ అయిన తర్వాత ఆయనే నాతో మాట్లాడారంటూ కృష్ణవంశీ అన్నారు. మొత్తానికి గురు శిష్యుల మధ్య ఉన్న విభేదాలకు క్లారిటీ రావడంతో వర్మ ఫ్యాన్సు కృషి అవుతున్నారు… ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది. కృష్ణవంశీ రంగమార్తండా సినిమా తర్వాత మరో సినిమాని అనం చేయలేదు.. అటు వర్మ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×