Kiran Abbavaram : దిల్ రూబా పేరులో చాలా దిల్ ఉంది. కానీ, ఈ సినిమా చేస్తున్న హీరోకు దిల్ లేదని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒక హీరోనే ఎందుకు ఇంతలా అంటున్నారు..? అనేది ఇప్పుడు చూద్దాం…
‘క’ మూవీ బ్లక్ బస్టర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న మూవీ దిల్ రూబా. ఈ నెల 14 ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే… ఈ మూవీపై ఎలాంటి బజ్ లేదు. కిరణ్ అబ్బవరం హీరోగా గతంలో వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ మూవీలా… ఇప్పుడు దిల్ రూబా పరిస్థితి ఉంది. దీనికి కారణం హీరోనే అంటున్నారు.
ప్యాకేజ్ హీరో…
సాధారణంగా… హీరోలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. తర్వాత తమ సినిమా హిట్ అవ్వాలని ప్రమోషన్స్ చేస్తారు. కానీ, కిరణ్ అబ్బవరం మాత్రం… రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్స్ కు సంబంధించిన ఫీజ్ కూడా లెక్కలు వేసి ఓ ప్యాకేజ్‌గా తీసుకుంటాడట. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నింటికీ ఆ ప్యాకేజ్ తీసుకున్నాడట. ఆ ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టే… ఇప్పటి వరకు అన్ని సినిమాలకు ప్రమోజన్స్ జోరుగా చేశాడట.
దిల్ రూబాకు నో ప్యాకేజ్..?
ఇప్పటి వరకు ప్రతీ సినిమాకు ప్యాకేజ్ తీసుకున్న కిరణ్ అబ్బవరం… ఈ దిల్ రూబా మూవీకి ఎలాంటి ప్యాకేజ్ తీసుకోలేడని సమాచారం. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నట్టు టాక్. దీంతో దిల్ రూబా ప్రమోషన్స్ ను కిరణ్ అబ్బవరం పూర్తిగా లైట్ తీసుకున్నాడనే మాటలు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తున్నాయి.
దిల్ రూబా ప్రమోషన్స్…
ఇప్పటికే పలు కారణాలతో దిల్ రూబా మూవీపై ఎలాంటి బజ్ లేదు. ఇప్పుడు మూవీ హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్‌ను మొత్తం దూరం పెట్టి, లైట్ తీసుకోవడంతో… సినిమాకు మరింత నష్టం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ క్రిటిక్స్. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన గత సినిమాలతో పోలిస్తే… ఈ దిల్ రూబా మూవీకి హీరో చేస్తున్న ప్రమోషన్స్ చాలా… తక్కవగా ఉన్నాయనే మాటలు ఇప్పటికే ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి.
నిజానికి హీరో… రెమ్యునరేషన్ తీసుకున్నా.. లేకపోయినా… తాను నటించిన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలి. అలా చేస్తే నిర్మాత కోసం ఆలోచించే హీరో అని, కాస్త దిల్ ఉన్న హీరో అని అంటారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం అలా చేయకపోవడంతో… దిల్ రూబా హీరోకు దిల్ లేదు అనే కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఆ నిర్మాత కొడుకు వద్దు అనుకన్న కథ..??
ఇదిలా ఉండగా, ఈ దిల్ రూబా కథను డైరెక్టర్ విశ్వ కరుణ్ ముందుగా కిరణ్ అబ్బవరం ముందు పెట్టలేదట. ఈ స్టోరీ మొత్తం ప్రిపేర్ చేసి… ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి ముందుకు వెళ్లిందట. అయితే… స్టోరీని పూర్తిగా చూసిన నిర్మాత ఈ దిల్ రూబాను పక్కన పెట్టారనే టాక్ ఉంది. దీంతో… డైరెక్టర్ విశ్వ కరుణ్ ఈ కథను కిరణ్ అబ్బవరం కు వినిపించారట. అక్కడ నచ్చలేని కథ.. ఇక్కడ కిరణ్ అబ్బవరంకు నచ్చడంతో… సినిమా పట్టాలెక్కిందని తెలుస్తుంది.