BigTV English

Hero Nani: సుజీత్ సినిమాకు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న నాచురల్ స్టార్..!

Hero Nani: సుజీత్ సినిమాకు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న నాచురల్ స్టార్..!

Hero Nani:సినిమా ఇండస్ట్రీ అంటేనే సముద్రంలో ఎగిసిపడే అలల లాంటిది.. అలలు పడుతూ లేస్తూ ఉంటాయి. సినిమాల్లో కూడా హిట్స్, ఫ్లాప్స్ అనే దానిపైనే హీరోల లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో వచ్చిన ‘బాహుబలి’ సినిమా తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలోకి ఎప్పుడైతే వెళ్లిందో అప్పటినుంచి టాలీవుడ్ అంటే చాలామంది గౌరవిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ హీరో అయినా.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నారు. ఇదే తరుణంలో చిన్న సినిమాలు చేసే హీరోల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వీరి సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు. ఇక పై స్థాయి, కింది స్థాయి మధ్యలో ఉండే టైర్ -2 హీరోలు మాత్రం మంచి ఊపు మీద ఉన్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాని (Nani).


రెమ్యూనరేషన్ విషయంలో నాని భారీ డిమాండ్..

నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చారు.. తనదైన నటనతో నేచురల్ స్టార్ గా మారారు. అలాంటి నాని కేవలం కామెడీ,లవ్ సినిమాలే కాకుండా మాస్, యాక్షన్ సినిమాల్లో కూడా తిరుగులేకుండా నటిస్తాడని దసరా సినిమా(Dasara Movie) ద్వారా నిరూపించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన హిట్ అందుకుంది. అయితే నాని కెరియర్ ఈ సినిమాకి ముందు ఒక లెక్క, ఈ సినిమా తర్వాత మరో లెక్క అనే విధంగా తయారయ్యింది. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచాడు. దసరా సినిమాకు ఆయన దాదాపుగా రూ.20 కోట్లకు పైగానే తీసుకున్నారట. ఆ తర్వాత సరిపోదా శనివారం(Saripoda Sanivaaram) సినిమాతో మన ముందుకు వచ్చి రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. వరుస విజయాలతో నాని జోరు మీద ఉన్న తరుణంలో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అటు సుజిత్ మూవీకి స్టార్ హీరో రేంజ్ లో రెమ్యూనరేషన్..

ప్రతి సినిమాకు రూ.25 కోట్లకు పై మాటే చెబుతున్నారట.. అంతేకాదు ఈ మధ్యకాలంలో డివివి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ వారు హీరో నానికి రూ.50 కోట్ల ప్యాకేజీ ముందుగానే ఇచ్చారని తెలుస్తోంది.. సరిపోదా శనివారం మూవీ చేస్తున్న సమయంలోనే డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజిత్(Sujith) సినిమాకు కమిట్ అయిపోయి సైన్ చేశాడని, కాస్త సమయం తీసుకున్న సరే వీరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని సమాచారం. ఇదే కాకుండా దసరా సినిమాకు డైరెక్షన్ చేసిన శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ సినిమా(Paradise) కూడా చేయబోతున్నారట. ఈ చిత్రానికి కూడా రూ.25 కోట్లకు పైగానే పారితోషికం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నాని(Nani)ని చూస్తే మాత్రం మిడిల్ రేంజ్ హీరోలలో మంచి జోరు మీద ఉన్నారని చెప్పవచ్చు. అంతేకాదు నాని రెమ్యూనరేషన్ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ నాని వెరీ కాస్ట్లీ గురూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×