Rashmika Mandanna: మామూలుగా అసలు హీరోయిన్స్‌కు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇవ్వొచ్చన్న విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ఎవరైనా హీరోయిన్ నచ్చితే తనను క్రష్ అనుకోవడం తప్పా దేశవ్యాప్తంగా మెజారిటీ యూత్ అంతా కలిసి ఒక హీరోయిన్‌ను నేషనల్ క్రష్ అనుకోవడం మొదలయ్యింది రష్మిక మందనా నుండే. కన్నడ బ్యూటీ అయిన రష్మిక ఒకట్రెండు సినిమాలు చేయగానే నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుండి ఎంతోమంది ముద్దుగుమ్మలు ఈ ట్యాగ్ దక్కించుకున్నా మొదటి నేషనల్ క్రష్ మాత్రం రష్మికనే అన్నట్టుగా మిగిలిపోయింది. తాజాగా మరోసారి ఈ ట్యాగ్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ.
అన్నింటిలో బిజీ
నేషనల్ క్రష్ అని ట్యాగ్ సొంతం చేసుకున్న కొత్తలో ఎంతో సంతోషం వ్యక్తం చేసింది రష్మిక మందనా. కానీ గత కొన్నిరోజులుగా తనకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కంటే పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌తో పిలుస్తున్నారు ఫ్యాన్స్. తను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో తను పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో జిమ్ చేస్తూ తన కాలికి గాయం అయ్యేలా చేసుకుంది. ఆ తర్వాత తనకు పూర్తిగా బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పినా.. తను మాత్రం సినిమా ప్రమోషన్స్ కోసం బయట తిరుగుతూనే ఉంది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.
జీవితంలో భాగం
‘‘కిరిక్ పార్టీ సినిమాతోనే నేషనల్ క్రష్ అనే టైటిల్ నాకు స్టార్ట్ అయ్యింది. అప్పట్లో నేను కాలేజ్ మొత్తానికి క్రష్‌గా ఉండేదాన్ని. ఆ తర్వాత కర్ణాటకకు క్రష్‌గా మారాను. మెల్లగా నేషనల్ క్రష్ అయ్యాను. ఇప్పుడు నాకు వస్తున్న ప్రేమ చూస్తుంటే ఆ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ నుండి నేను ఎప్పుడో తప్పుకున్నాను. ఇప్పుడు ప్రేక్షకులు నా దగ్గరకు వచ్చి నువ్వు దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ ఇష్టం, నువ్వు ప్రతీ ఒక్కరి మనసులో ఉన్నావు.. ఇలా చెప్తున్నప్పుడు మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. ఇప్పుడు నేను వారి జీవితాల్లో, మనసుల్లో భాగమయిపోయానని అనిపిస్తుంది. అలా అంటే నేను చేస్తున్న పనిలో ముందడుగు వేస్తున్నట్టే’’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందనా.
Also Read: క్రౌన్, కింగ్ అంటూ.. ‘VD 12’ టైటిల్‌కి క్లూ ఇచ్చిన రౌడీ హీరో..
క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం రష్మిక మందనా (Rashmika Mandanna) చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ మరే ఇతర హీరోయిన్ ఖాతాలో కూడా లేవు. ముఖ్యంగా హిందీలో బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ దూసుకుపోతోంది ఈ కన్నడ బ్యూటీ. ఇప్పటికే విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ‘ఛావా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్‌లో రష్మిక చాలా బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’లో కూడా రష్మికనే హీరోయిన్. ఆయుష్మాన్ ఖురానా, ధనుష్ లాంటి హీరోలతో కూడా రష్మిక జోడీకడుతోంది. అలా ప్రస్తుతం క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడుతోంది రష్మిక మందనా.