Hero Nani :నవీన్ బాబు ఘంటా.. నాని (Nani) గా అందరికీ సుపరిచితమైన ఈయన కృష్ణాజిల్లా చల్లపల్లిలో జన్మించారు. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాదులో స్థిరపడడంతో.. ఇక్కడికి వచ్చేసిన నాని, అక్కడే తన విద్యను పూర్తి చేసి డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టారు. అలా ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని.. డైరెక్టర్ శ్రీనువైట్ల(Srinu vaitla) , బాపు (Baapu) వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి, ఆ తర్వాత హైదరాబాదులో కొన్ని రోజులు ‘రేడియో జాకీ’గా కూడా పనిచేశారు. ‘అష్టాచమ్మా’ అనే తెలుగు సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాని.. ఆ తర్వాత రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘ఈగ’ సినిమాలో నటించి, ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు.
ఆశ్చర్యపరుస్తున్న నాని ట్రాన్స్ఫర్మేషన్..
ఇక 2015 లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచీ 2017లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకొని, రికార్డ్ సృష్టించారు. ఇక నాని హీరో గానే కాకుండా 2014 లో వచ్చిన ‘డి ఫర్ దోపిడి’ సినిమాతో నిర్మాతగా మారారు. ‘ఆ!’ సినిమాతో నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన జెర్సీ, దేవదాస్, భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, జెంటిల్మెన్, నేను లోకల్, నిన్ను కోరి ఇలా చాలా చిత్రాలలో నటించారు. కానీ అన్ని చిత్రాలలో కూడా చాలా సాఫ్ట్ గా లేదా మోస్తారు యాక్షన్ పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు. అయితే. ఇప్పుడు ఆయన అవతారం చూస్తే మాత్రం నిజంగా భయమేస్తోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం , దసరా సినిమాలతో మాస్ హీరోగా పేరు దక్కించుకున్న నాని.. అంటే సుందరానికి సినిమాలో చాలా సాఫ్ట్ బాయ్ గా కనిపించి మెప్పించారు. అలాంటి నానిని ఇప్పుడు అత్యంత క్రూరుడుగా మార్చేశారు. ముఖ్యంగా అంటే సుందరానికి సినిమా మొదలు ఇటీవల శైలేష్ కొలను(Shailesh Kolanu) దర్శకత్వంలో త్వరలో రాబోతున్న ‘హిట్ 3 ‘ వరకు వచ్చిన సినిమాలన్నింటినీ గమనిస్తే నానీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇంత క్రూరంగా మారావేంటి నాని..
ముఖ్యంగా హిట్ 3 సినిమాలో నానిని చూసి ఓర్ని దుర్మార్గుల్లారా.. ఎలా ఉండేవాడిని.. ఎలా మార్చేశారు? అంటూ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు చాలా సాఫ్ట్ గా అమ్మాయిల ఫేవరెట్ హీరోగా మారిన నాని ఇప్పుడు ఒక్కసారిగా పూర్తి వైలెంట్ గా కనిపించేసరికి అభిమానులే భయపడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్న హిట్ 3 సినిమాలో క్రూరత్వం ఉన్ని ముకుందన్ మార్క్ మూవీకి మించి ఉన్నట్లు మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి సినిమాలతో నాని విజయాన్ని అందుకుంటారు కానీ ఒకప్పటి ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నానిలో కనిపించడం లేదనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా పాత్ర డిమాండ్ చేస్తే ఇలాంటి పాత్రలు చేయడం తప్పనిసరి కానీ కంటిన్యూస్గా అదే పాత్రలు చేస్తే ప్రజలలో అభిప్రాయాలు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అసలే తెలుగు ఇండస్ట్రీలో నాని అనే ఒకే ఒక మంచోడిగా ఉన్న వ్యక్తిని కూడా మార్చేశారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నాని ట్రాన్స్ఫర్మేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.