Odela 2 Movie: ఈరోజుల్లో హీరోయిన్స్ సైతం ఒకే విధమైన పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఆదరించరేమో అని అభిప్రాయపడుతున్నారు. అందుకే సీనియర్ హీరోయిన్లు సైతం కొత్త కొత్త పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. తమన్నా హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుండి చాలావరకు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లోనే నటించింది. ఐటెమ్ సాంగ్స్‌లో స్పెషలిస్ట్ అయిపోయింది. కానీ చాలాకాలం తర్వాత మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ‘ఓదెల 2’లో శివశక్తి పాత్రలో కనిపించనుంది తమన్నా. తాజాగా ఈ సినిమా కోసం ఎవరు ఎలా పనిచేశారు అనే విషయాన్ని బయటపెట్టింది ఈ బ్యూటీ.
అవన్నీ కనిపించవు
‘‘ఓదెల 2 సినిమా కోసం అందరం ఒక టీమ్‌లాగా పనిచేశాం. మా పనికి ఒక పేరు లేకుండా కష్టపడ్డాం. ఇది నా పని కాదు, ఇది నీ పని కాదు అనుకోలేదు. మీరు డైరెక్టర్, మీరు రైటర్ అని పేర్లు పెట్టుకోలేదు. ఒక టీమ్‌లాగే అన్నీ చేశాం. మంచి సినిమాలు అనేవి ఇలాగే తయారవుతాయి. బాహుబలి సినిమా సమయంలో రాజమౌళి స్వయంగా ఐస్‌ను ఊడ్చేవారు. సినిమాలు చేస్తున్నప్పుడు పనికి పేరు పెట్టుకొని పనిచేయము. సినిమా చూస్తున్నప్పుడు అవేమీ కనిపించవు. సినిమా మాత్రమే కనిపిస్తుంది. ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ అని మర్చిపోతారు. మంచి సినిమానా, చెడ్డ సినిమానా అనే గుర్తుపెట్టుకుంటారు’’ అని చెప్పుకొచ్చింది తమన్నా.
ఎక్స్‌పీరియన్స్ కోసమే
‘‘ఒక సినిమా ఎక్స్‌పీరియన్స్ మీకు బాగుండాలని మేమంతా కలిసి కష్టపడతాం. ఓదెల 2 (Odela 2) సెట్‌లో కూడా అందరం టీమ్‌లాగా పనిచేశాం. ఎవరు ఇది నా పని కాదు అని అనలేదు. అది చాలా ఇన్‌స్పైరింగ్ అనిపిస్తుంది’’ అని తెలిపింది తమన్నా. అంతా బాగుంది కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేవారు ఎవరి పని వారు చేస్తే బాగుంటుందని, అందరూ అన్ని పనులు చేస్తే సినిమా ఔట్‌పుట్ మంచిగా ఎలా వస్తుందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తమన్నా హీరోయిన్‌గా, శివశక్తి పాత్రలో కనిపించడం వల్ల ‘ఓదెల 2’పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. కానీ దీని గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్న వారు ఎంతమంది ఉన్నారో.. నెగిటివ్‌గా మాట్లాడుతున్న వారు కూడా అంతేమంది ఉన్నారు.
Also Read: అదరగొట్టేసిన నిహారిక.. త్వరలో మరో తెలుగు మూవీలో ఛాన్స్..
భారీ సీక్వెల్
దాదాపు మూడేళ్ల క్రితం విడుదలయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా మంచి హిట్‌ను అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ అప్పుడే నిర్ణయించుకున్నారు. కానీ సీక్వెల్ ప్లానింగ్ భారీగానే జరిగింది. సంపద్ నంది లాంటి క్రేజీ డైరెక్టర్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. అంతే కాకుండా ‘ఓదెల 2’కు కథ, మాటలు కూడా ఆయనే అందించాడు. పైగా ఇందులో హీరోయిన్‌గా తమన్నా (Tamannaah) యాడ్ అయ్యింది. అలా ‘ఓదెల 2’ రేంజే మారిపోయింది. తాజాగా విడుదలయిన ట్రైలర్‌లో కూడా తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచే యాక్టింగ్ కనబరిచింది. అసలు మిల్కీ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.