Nikhil Siddarth : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరో అయ్యాడు. నిఖిల్ గతంలో చేసిన సినిమాలు ఒక లెక్క కార్తికేయ సినిమా తర్వాత అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాతో భారీ విషయాన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఆ సినిమాలు ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. కార్తికేయ 2 సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరో అయ్యాడు.. కార్తికేయ 3 కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ప్రస్తుతం స్వయంభుతో పాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈ సినిమాలను గురించి అప్డేట్స్ రాలేదు.. నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ ఏమైయ్యాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. అసలు ఏం అయ్యింది నిఖిల్ కు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
నిఖిల్ ‘స్వయంభూ’..
నిఖిల్ (Nikhil Siddhartha), హీరోగా భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) రూపొందిస్తున్న ‘స్వయంభూ’ (Swayambhu) అలానే చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే అయితే షూటింగ్ జరుగుతుందా లేదా అన్న విషయాన్ని మాత్రం మేకర్స్ గోప్యంగా ఉంచారు.. ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ ఇప్పటివరకు పెద్దగా బయటకు రాలేదు. ఆ మధ్య ఎప్పుడో హీరోయిన్ల పుట్టిన రోజు సమయంలో పోస్టర్లు వచ్చాయి. ఎందుకు, ఏమిటి అనే విషయాలు పెద్దగా తెలియడం లేదు. అయితే తాజాగా నిఖిల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిఖిల్ అన్నారు. అయితే ఈ సినిమా గురించి ఈమధ్య ఎటువంటి అప్డేట్ ని వదల్లేదు. మరి సినిమా పూర్తయిందా? లేదా ఏదైనా సమస్య వల్ల ఆగిపోయిందా? అన్నది తెలియట్లేదు.. కానీ నిఖిల్ మాత్రం సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని మిస్ చెయ్యొద్దు..
ఆ ఒక్క కారణంతోనే నిఖిల్ బ్రేక్ తీసుకున్నాడా..?
నిఖిల్ కార్తికేయ 2 తర్వాత పెద్దగా మీడియా ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. బయట కూడా పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. ఆయనకు కొడుకు పుట్టిన విషయాన్ని స్వయంగా నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. కొడుకు నామకరణం బారసాల అంటూ ఫోటోలు పెట్టాడు కానీ సినిమాల గురించి ఎక్కడ ఒక ఫోటోను కూడా షేర్ చేయలేదు. దాంతో ఆయన చేస్తున్న సినిమాలపై రకరకాల వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. నిఖిల్ ఇప్పుడు చేస్తున్న స్వయంభు సినిమా నిర్మాతలతో గొడవ జరిగిందేమో అందుకే సినిమా గురించి బయట పెట్టలేదేమో అని అంటున్నారు.. మరి ఈ వార్తలు పై స్వయంభు టీం లేదా నిఖిల్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి… ఏమైనా ఏడాదికి ఒక్క సినిమాతో పలకరించే హీరో ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకులను పలకరిస్తాడో లేదో చూడాలి..