Big Stories

Nithin : టాలీవుడ్ కి ఆ హీరోయినే దిక్కు.. వైరల్ అవుతున్న నితిన్ స్టేట్మెంట్..

Nithin

Nithin : హిట్ ,ఫ్లాప్ తో సంబంధం లేకుండా సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాల తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసే నటుడు హీరో నితిన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి తెగ తాపత్రయ పడుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ శ్రీ లీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ ప్రస్తుతం బాగా వైరల్ కూడా అయ్యాయి …’ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి’.. ‘ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను . జీవితం.. జీవితా నాకు రెండు ఒకటే..’లాంటి డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తున్నాయి. ట్రైలర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.

- Advertisement -

ఈ మూవీ తో పాటు వెంకీ కుడుములతో నితిన్ మరొక మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా మొదట రష్మిక అని అనుకున్నారు. భీష్మ మూవీ తర్వాత ఈ హిట్ తిరిగి రిపీట్ అవుతుంది అని ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా రష్మిక మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇటీవల నితిన్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో ఒకటి శ్రీ లీల కు సంబంధించిన టాపిక్. శ్రీ లీల గురించి నితిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. అయ్యో అలా ఎలా అనేశాడు అని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఏర్పడింది అని నితిన్ అన్నాడు.

అంతేకాదు తాను నటిస్తున్న వెంకీ కుడుముల మూవీలో హీరోయిన్ గా శ్రీ లీల చేస్తోందట..శ్రీ లీల లాంటి మంచి హీరోయిన్ తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను చేస్తున్న రెండు సినిమాలలోను ఒకే హీరోయిన్ తీసుకుంటున్నట్లు చెప్పడంతో.. అంటే ఇప్పుడు టాలీవుడ్ కి హీరోయిన్ అంటే శ్రీ లీల అని నితిన్ డైరెక్టుగా చెప్పినట్లు అందరూ భావిస్తున్నారు. ఇప్పటివరకు శ్రీ లీల మంచి లక్కీ హ్యాండ్ గా ముందుకు వెళ్తుంది.. మరి ఆమె లక్ నితిన్ కి కూడా కలిసి వస్తుందేమో చూడాలి. నితిన్ , శ్రీ లీల కాంబోలో వస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. డిసెంబర్ 8న థియేటర్లలో విడుదల కాబోతోంది. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News