Raj Tarun – Lavanya:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలం క్రితం సంచలనం సృష్టించిన అంశం రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య (Lavanya).. రాజ్ తరుణ్ ప్రియురాలిగా చెప్పుకున్న లావణ్య అనే యువతి ఆయన మీద సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి పేరుతో వాడుకున్నాడని, పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని చేసి , అబార్షన్ కూడా చేయించి వదిలేశాడని, ముఖ్యంగా మాల్వి మల్హోత్రా (Malvi Malhotra)అనే హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడని , ఇలా పలు రకాల ఆరోపణలతో తెర ముందుకు వచ్చింది. దీంతో కొంత కాలం పాటు లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారం అటు మీడియాలో కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ వార్తలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో సమస్య సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు.
మస్తాన్ సాయి రహస్యాలు బయట పెడతా..
అయితే ఇప్పుడు మళ్లీ రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య సెకండ్ ఇన్నింగ్స్ తో వస్తున్నా.. ఈసారి మస్తాన్ సాయి (Mastaan sai) నా టార్గెట్.. అతడి అన్ని వ్యవహారాలను త్వరలోనే బయట పెడతాను. ఈ సారి లైంగిక వేధింపులకు, డ్రగ్స్ అలాగే మనీ గురించి సంబంధించింది. సోమవారం ఉదయానికి అతని మొదటి వీడియోతోనే నేను పని మొదలు పెడతాను అని చెబుతూనే, మీడియాకి కూడా ధన్యవాదాలు తెలిపింది. ఇకపోతే లావణ్య.. మస్తాన్ సాయి అనే యువకుడితో ప్రేమాయణం నడుపుతూ.. తనను మోసం చేసిందని, అందుకే ఆమెను వివాహం చేసుకోకుండా దూరం పెట్టానని అప్పట్లో రాజు తరుణ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అయితే అలాంటిది ఇప్పుడు లావణ్య , మస్తాన్ సాయి గురించి కీలక విషయాలు అంటూనే డ్రగ్స్ అలాగే డబ్బు గురించి పలు కీలక విషయాలు చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏం జరగనుంది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
లావణ్య కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్..
గతంలో ఆర్జే గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ బాషా (Sekhar basha) లైవ్ డిబేట్ పెట్టి మరీ, లావణ్య తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమెపై ఆరోపణలు చేయడంతో ఆమె లైవ్ లోనే చెప్పుతో కొట్టిందని వార్తలు వైరల్ అయ్యాయి.దీంతో శేఖర్ భాష గూండాలను పెట్టించి మరీ ఆమెతో దాడి చేయించాడని ఆమె పోలీసుల ముందు తన బాధ వెళ్లగక్కింది. అక్కడితో ఆగకుండా.. తనపై దాడి చేశాడని, తాను చెప్పుకోలేని ప్రదేశాలలో కూడా కొట్టాడు అంటూ పోలీసుల ముందు వాపోయింది లావణ్య. ఆ తరువాత లావణ్య తన అనుచరులతో కాపు కాసి మరీ శేఖర్ భాషా పై దాడి చేయించిందని , అతడు చేతికి కట్టుతో హాస్పిటల్లో కూడా కనిపించారు. ఇక ఇలా ఈ విషయాలన్నీ కూడా అప్పట్లో సంచలనంగా మారాయి మరి ఆ తర్వాత అంతా కూల్ అయిపోయింది..ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తోంది లావణ్య .ఈసారి ఏం జరుగుతుందో చూడాలి .ఇకపోతే లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలకంగా మారిన ఆర్ జె శేఖర్ భాషా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.