BigTV English

Gary Hall Jr Olympic Medals: 10 పతకాలు కాలి బూడిద… ఒలింపిక్ స్విమ్మర్ కు ఎన్ని కష్టాలో !

Gary Hall Jr Olympic Medals: 10 పతకాలు కాలి బూడిద… ఒలింపిక్ స్విమ్మర్ కు ఎన్ని కష్టాలో !

Gary Hall Jr Olympic Medals: ఒక క్రీడాకారుడు మెడల్స్ సంపాదించడం చాలా కష్టం. అందులోనూ ఒలింపిక్స్ మెడల్ సాధించడం… ఈ కాలంలో అసాధ్యం. అయితే అలాంటిది ఏకంగా 10 ఒలంపిక్ మెడల్స్… ఓ క్రీడాకారుడు పోగొట్టుకున్నాడు. పంచభూతాలు అతనికి ఆ పది ఒలింపిక్ మెడల్స్ దక్కకుండా చేశాయి. అవును లాస్ ఏంజెలీస్ లో ( Los Angeles wildfires ) ఏర్పడిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో… చాలామంది… నిరాశ్రయులు కావడం జరిగింది. ఈ సంఖ్య వేలల్లో ఉంది.


Also Read: Mohammed Shami: ఇంగ్లాండ్‌ తో టీ20 సిరీస్‌..షమీ,నితీష్ కు ఛాన్స్… వైస్‌ కెప్టెన్‌ గా అక్షర్‌ పటేల్‌!

అయితే ఈ నేపథ్యంలోనే మాజీ యుఎస్ ఒలంపిక్ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr Olympic )… ఈ కార్చిచ్చు బాధితుడిగా మారిపోయాడు. తాను సాధించిన… పది ఒలింపిక్ మెడల్స్ ను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. తాజాగా జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో… గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr Olympic ) ఇంటికి కూడా… మంటలు అంటుకున్నాయి. దీంతో… తన ఇల్లు కాలిపోతున్న కూడా చూస్తూ ఉండిపోయాడు. ఇంట్లో ఉన్న ఏ ఒక్క వస్తువును కూడా తన వెంట తీసుకు రాలేకపోయాడు.


Also Read: Big Bash league: కొడుకు భారీ సిక్స్‌..క్యాచ్‌ పట్టిన తండ్రి..వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే !

తన ప్రాణాలను ముందుగా రక్షించుకోవాలనే హడావిడిలో… తాను గెలుచుకున్న పది ఒలంపిక్ మెడల్స్ ( 10 Olympic medals ) కూడా పోగొట్టుకున్నాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన పది ఒలింపిక్ మెడల్స్ అందులోనే కాలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఈ గ్యారీ హాల్ జూనియర్. ఇందులో మూడు వేరువేరు ఒలంపిక్ ఎడిషన్స్ లో 10 పతకాలు గెలుచుకున్నాడు గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr ).

గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr ) ఒలింపిక్ విజయాలలో మొదటిది 2000 (సిడ్నీ) లో చోటు చేసుకుంది. 2004 (ఏథెన్స్) ఒలింపిక్స్‌లో పురుషుల 50-మీటర్ల ఫ్రీస్టైల్‌లో బ్యాక్-టు-బ్యాక్ స్వర్ణాలు సాధించాడు. 1996 (అట్లాంటా) గేమ్స్‌లో మూడు ఒలింపిక్స్‌లో మూడు రజతాలు సాధించాడు గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr ). అలాగే రెండు కాంస్యాలతో పాటు రిలే ఈవెంట్‌లలో మూడు స్వర్ణాలను కూడా సంపాదించాడు.

కాగా, దక్షిణ కాలిఫోర్నియాను నాశనం చేస్తూనే ఉన్న అడవి మంటలు గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr )తో సహా చాలా మంది నివాసితులను పారిపోయేలా చేశాయి. ఈ మంటలు చెలరేగిన రెండు రోజుల తర్వాత, గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr ) మీడియాతో తాను గెలుచుకున్న పది ఒలంపిక్ మెడల్స్ ( 10 Olympic medals ) గురించి తెలిపాడు.

వినాశనం జరిగింది…ఇంతటీ దారుణం ఎవరికీ జరుగకూడదంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇది నా గురించి మాత్రమే కాదు. నా ఇల్లు, నా వ్యాపారం మొత్తం పోయాయని వివరించారు. ఇక ఇప్పుడు మళ్లీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సమయం వచ్చిందన్నాడు గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr ). ఇలాంటి గందరగోళంలో కూడా నేను ప్రశాంతంగా ఉండగలగడం నా అదృష్టం అని తెలిపాడు. ప్రాణాల కోసం పరిగెత్తమని… ఈ నేపథ్యంలోనే సర్వస్వం కోల్పోయినట్లు వివరించాడు గ్యారీ హాల్ జూనియర్ ( Gary Hall Jr ).

 

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×