CM Revanth Reddy: సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది గాలిపటాలు. సంక్రాంతి వేడుకల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా.. అంతా పతంగుల ఎగరవేతలో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు. పండుగ వేళ పతంగులకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండుగ అంటేనే ఆహ్లాద వాతవరణ నెలకొని ఉంటుంది. ఈ సంక్రాంతికి ఇంటిల్లిపాది ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. పెద్దలు కూడా చిన్న పిల్లల మాదిరిగా అయిపోయి పంతంగులను ఎగరేస్తారు.
పతంగుల తయారీ దారులు రకరకాల ఆకృతులతో, బొమ్మలతో పతంగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. పండుగ నాటికి ఉంటే అప్పటి పరిస్థితులను అనుసరించి బాహుబలి, రోబో, పుష్ప, స్పైడర్ మ్యాన్ వంటి క్రేజీ హీరోల బొమ్మలతో, కార్టూన్ క్యారెక్టర్స్ తో.. జంతువుల బొమ్మలతో రకరకాల పతంగులను తయారు చేస్తుంటారు. కొందరు తమ అభిమాన నాయకులతో కూడిన ఫొటోలతో పతంగులు చేస్తుంటారు. అయితే.. సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగరేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా సంక్రాంతి చలికాలంలో వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడనే విషయం తెలిసిందే. అందుకే సూర్యుడికి అంకితం చేస్తూ గాలిపటాన్ని ఎగరేస్తారు. అలాగే చలికాలం పూర్తై వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పడానికి ఈ పంతంగులను ఎగరేస్తారని పెద్దలు కథలు కథలుగా చెబుతుంటారు.
Also Read: హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
ఈ క్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్ది ఫొటోతో కూడిన పతంగులు తయారు చేయించి పిల్లలకు ఉచితంగా అందిస్తు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరీలో రేవంత్ రెడ్డి సైకత శిల్పం తయారు చేయించిన మెట్టు.. ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫొటోతో కూడిన పతంగులను తయారు చేయించి పిల్లలకు పంపిణీ చేస్తుండటం విశేషం. ఈ సందర్భంగా మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రపంచ స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.