BigTV English

HBD Rajasekhar: యాంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ ఆస్తులు.. సంపాదించిన తక్కువ.. పోగొట్టుకుంది ఎక్కువ..?

HBD Rajasekhar: యాంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ ఆస్తులు.. సంపాదించిన తక్కువ.. పోగొట్టుకుంది ఎక్కువ..?

HBD Rajasekhar: ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు డాక్టర్ కాబోయి యాక్టర్స్ అయ్యాము అని చెప్తూ ఉంటారు. కానీ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా పేరు దక్కించుకున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) అటు డాక్టర్ గానే కాదు ఇటు యాక్టర్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు భిన్న విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రాజశేఖర్ తెలుగు, తమిళ్ సినిమాలలో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. 1962 ఫిబ్రవరి 4వ తేదీన వరదరాజన్ గోపాల్ , ఆండాళ్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలో తేనీ జిల్లా లక్ష్మీపురంలో జన్మించారు. రాజశేఖర్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. అటు రాజశేఖర్ కూడా చిన్నతనంలోనే ఎన్సిసి విద్యార్థిగా పేరు సొంతం చేసుకున్నారు. మొదట్లో తండ్రిలాగే తాను కూడా పోలీస్ ఆఫీసర్ అవాలనుకున్నా.. తన తండ్రి కోరిక మేరకు వైద్య విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత చెన్నైలో కొంతకాలం ప్రాక్టీస్ చేసిన రాజశేఖర్, సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా వైద్య వృత్తిపై తన ఆసక్తిని కొనసాగిస్తూ.. అటు సినిమాలలో నటిస్తూనే, ఇటు తన వైద్యవృత్తిని కూడా కొనసాగిస్తూ వచ్చారు.


రాజశేఖర్ వ్యక్తిగత జీవితం..

‘వందేమాతరం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రాజశేఖర్, ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో ఆయన పోషించిన పోలీస్ పాత్ర నిజ జీవితంలో కూడా కొంతమంది పోలీసులను ప్రభావితం చేసింది. ముఖ్యంగా రాజశేఖర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయనకు సాయికుమార్ (Sai Kumar) గాత్ర దానం చేసేవారు. ఇకపోతే వరుస సినిమాలలో నటిస్తున్నప్పుడే 1991లో సహనటి డైరెక్టర్ జీవిత ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శివాని (Shivani) , శివాత్మిక (Shivathmika) అనే కూతుర్లు కూడా జన్మించారు
శివాని MBBS చదువుతుండగా.. శివాత్మిక సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2019లో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) , శివాత్మిక తొలిసారి నటించిన చిత్రం ‘దొరసాని’. ఇక ప్రస్తుతం అటు శివాత్మిక వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.


రాజశేఖర్ ఆస్తుల వివరాలు..

ఇకపోతే ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరో రాజశేఖర్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ఆయన సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని చెప్పవచ్చు. ముఖ్యంగా సరైన కథలు ఎంపిక చేసుకోలేక చెన్నైలో ఉన్న చాలా ఆస్తులను కోల్పోయారు. దాదాపుగా రూ.200 కోట్ల వరకు నష్టాన్ని చవిచూసింది రాజశేఖర్ – జీవిత జంట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈయన కేవలం సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇక వివిధ వ్యాపారాల ద్వారా ఏడాదికి 12 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి ఆస్తులు వివరాల విషయానికి వస్తే.. సుమారుగా రూ.50 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా రాజశేఖర్ పోగొట్టుకున్న ఆస్తి గనుక ఉండి ఉంటే, నేడు ఆయన అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయే వారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సంపాదించింది తక్కువే పోగొట్టుకుంది ఎక్కువ అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×