E-Paper
Advertisement

Ram Nithin : పది రోజులు తాగాం, మందు ఇంత బాగుంటుందా అనిపించింది

Ram Nithin : పది రోజులు తాగాం, మందు ఇంత బాగుంటుందా అనిపించింది
Advertisement

Ram Nithin : ఒకప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలియాలి అంటే ఎక్కడో పేపర్లో కొన్ని కొన్ని వార్తలు వచ్చేవి. అయితే వాటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయనేవి ఎవరికీ అర్థం కాని విషయం. అవన్నీ గాసిప్స్ లాగానే చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి వాటికి తావులేదు. కొందరు సెలబ్రిటీస్ వాళ్ళు చేసే పనులను డైరెక్ట్ గా వాళ్ళ నోటితోనే కొన్ని ఇంటర్వ్యూస్ లో చెబుతున్నారు. ఇకపోతే చాలామంది హీరోలు కూడా ప్రేక్షకులకు కాంటాక్ట్ లో ఉంటున్నారు. ఒకప్పుడు సినిమా అంటే అక్కడెక్కడో ఉన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సినిమా అంటే మన మధ్యనే ఉంది అని అర్థమవుతుంది. చాలామంది సెలబ్రిటీలు కూడా వాళ్ళ సినిమా ప్రమోట్ చేయడానికి కొంతమంది ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లను వాడుతూ ఉంటారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల చాలామందికి ఫిలిం ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరికింది. చాలామంది కొత్త కొత్త నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అందులో రామ్ నితిన్ ఒకడు.

మ్యాడ్ సినిమాతో గుర్తింపు

Advertisement

కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన సినిమా మ్యాడ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాని ప్రమోట్ చేసిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. నిర్మాత నాగ వంశీ ఈ సినిమా జాతి రత్నాలు సినిమా లాగా ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా స్వతహాగా కళ్యాణ్ శంకర్ కూడా జాతి రత్నాలు సినిమాకి రైటర్ కావడం ఒక ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అయింది. కళ్యాణ్ శంకర్ కూడా మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే మ్యాడ్ స్క్వేర్ సినిమాను కూడా ప్లాన్ చేసి రిలీజ్ చేశాడు. ఆ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.

మ్యాడ్ తర్వాత పది రోజులు తాగాం

Advertisement

ఇక మ్యాడ్ సినిమా సక్సెస్ అయిపోయిన తర్వాత హీరో రామ్ నితిన్, సంగీత్ శోభన్ వీరిద్దరూ కలిసి పది రోజులు తాగారట. ఆ పది రోజులు తాగుతున్నప్పుడు మందు ఇంత బాగుంటుందా అనే ఫీలింగ్ వచ్చింది బ్రో. ముందు కొంత తాగాం తర్వాత ఎక్కలేదు అంటే మళ్ళీ వాడుక తెచ్చుకుని తాగాం అంటూ స్వయంగా రామ్ నితిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత వాళ్లు అదే పనిగా కాకుండా కేవలం సినిమా సక్సెస్ అయినప్పుడు మాత్రమే తాగాలి అని నిర్ణయించుకున్నారట. అంత డెడికేషన్ తో ఉన్నారు కాబట్టి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మళ్లీ మ్యాడ్ స్క్వేర్ సినిమా హిట్ అయిన తర్వాత మేము పార్టీ చేసుకున్నాం అంటూ రాము నితిన్ ఒక ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read : Trivikram Srinivas: వెంకటేష్, నాని కాంబినేషన్ లో సినిమా

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×