Pahalgam Terror Attack: ఉగ్ర దాడి ఘటనపై మృతుల బంధువులను ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. తమ కళ్ల ముందు ఉన్నవారు ముష్కరుల తూటాలకు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఓ వైపు ఆవేదన.. మరో వైపు ఆక్రోశం.. ఆపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల తలలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సన్నివేశం చాలామందిని కంట తడి పెట్టిస్తోంది.
జమ్మూకాశ్మీర్‌లో పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో ఆశువులు బాసిన మృతుదేహాలను వారి వారి స్వస్థలాలకు విమానంలో తరలిస్తోంది ప్రభుత్వం. కళ్ల ముందు ఉన్న వ్యక్తులు అర్థాంతరంగా ఉగ్రవాదుల చేతిల్లో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారి కుటుంబ సభ్యులు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడంలేదు. దేశం కోసం ప్రాణం విడిచారని భావించాలో తెలీదు. అయినవాళ్లని వదిలి ఈ లోకానికి దూరమయ్యారనే బాధ మరోవైపు. ఫలితంగా బాధితుల్లో ఆగ్రహం కనిపిస్తోంది.
పహల్‌గామ్‌లో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వినయ్ ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నాడు. హనీమూన్ కోసం జమ్మూకాశ్మీర్‌కు వెళ్లాడు. ముష్కరుల రూపంలో ఆయన్ని మృత్యువు వెంటాడింది. అప్పటివరకు భార్యతో కలిసి డాన్స్ చేస్తూ హాయిగా గడిపాడు. కానీ ఆ క్షణాలు ఎంతోసేపు నిలవలేదు. గంటల వ్యవధిలో ఆ ఆనందం ఆవిరైపోయింది.
అదే వినయ్ ఫ్యామిలీకి, భార్యకు చివరి గుర్తులుగా మిగిలిపోయాయి. కొచ్చిలో పోస్టింగ్‌లో ఉన్న నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ వయసు 26 ఏళ్లు. హర్యానాకి చెందినవారు. బుధవారం సాయంత్రం స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాళ్ల పారాణి ఆరకముందే భర్త చనిపోయాడన్న బాధలో భార్యలో ఉంది. ఎక్కిఎక్కి ఏడ్చినా ఫలితం లేకపోయింది. అధికారిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.
ALSO READ: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ముస్లి, నివాళులర్పించిన కాశ్మీర్ సీఎం
ఇదే సమయంలో వినయ్ నర్వాల్ సోదరి కాసింత ఆగ్రహానికి గురైంది. మా అన్న గంటన్నర బతికే ఉన్నాడని, ఆర్మీ వాళ్లు సమయానికి వచ్చి ఉంటే బతికేవాడని కన్నీరు మున్నీరు అయ్యింది. మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు ఇవ్వండి అంటూ కన్నీటి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రశ్నలకు ఏం చెయ్యాలో తెలియక రాజకీయ నేతలు, కొందరు అధికారులు ఇబ్బందిపడిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
ఉగ్ర దాడి ఘటన కోట్లాది మంది భారతీయుల మనసును గాయపరిచింది. దీనికి ప్రభుత్వాలు సరైన చికిత్స చేస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దౌత్యపరంగా భారత్ చేయాల్సినవన్నీ చేస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది కూడా.
My brother was alive for 1.5 hours but no one was there, he could have been saved
; – Sister of #VinayNarwal #PahalgamTerroristAttack#Pahalgam#pahalgamattack#PahalgamTerrorAttackpic.twitter.com/DT96Nm5y4W
— Milagro Movies (@MilagroMovies) April 23, 2025
😢😢😢😢#PahalgamTerroristAttack #Pahalgam #VinayNarwal pic.twitter.com/lhNWeYT4r9
— अनुभव नरवाल (@anubhav_narval) April 24, 2025