Jagityal Crime: ఇంటికి దీపం ఇల్లాలని.. కార్యేసు దాసి కరణేసు మంత్రని ఇల్లాలు గురించి గొప్పలు ఎన్నో చెబుతుంటారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంటుంటారు. కానీ ఇల్లాలికి అత్తారింట్లో అడుగడుగున నరకమే.. వరకట్న వేధింపులకు ఇప్పటికీ బలౌతున్నారు మహిళలు..
పెళ్లంటే నూరేళ్లపంట.. కానీ ప్రస్తుతం రోజుల్లో మూడునాళ్ల ముచ్చటగా మారింది. కట్నం కోసం హింసించి తాళి కట్టిన భార్యను కాటికి పంపుతున్నారు. అత్తంటికి ఆరళ్లు, ఆడపజడుచుల వేధింపులలతో మహిళల ఉసురు తీసుకుంటున్నారు.
పెళ్లి జీవితంలో ఎవరికైనా మధుర జ్ఞాపకం.. కానీ కొన్ని పెళ్లిళ్లు మహిళలకు మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. మగాళ్లతో సమానంగా చదివి ఉద్యోగం చేస్తున్నా.. మహిళలు వివక్షకు గురవుతున్నారు. అదనపు కట్నం కోసం మానసికంగా హింసించి, ఆత్మహత్య చేసుకునేందుకు కారణం అవుతున్నారు కొందరు. ఆడపిల్ల అత్తంటి వారింట్లో సంతోషంగా ఉండాలని.. తాహతకు మించి కట్న కానుకలు ఇస్తున్నారు తల్లిదండ్రులు.. అయినా కట్నం దాహం తీరని కొందరు మగాళ్లు.. అదనపు కట్నం కోసం రాక్షసంగా మారుతున్నారు. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. కోరిన కట్నం ఇవ్వలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక మహిళలు సూసైడ్ చేసుకుంటున్నారు. వరకట్న వేధింపులకు ఇప్పటికీ బలౌతున్నారు మహిళలు..
Also Read: 9 భార్యలకు విడాకులచ్చిన యువకుడు.. 10వ భార్య ఆ పని చేసిందని హత్య
తాజాగా వరకట్నం వేధింపులు భరించలేక.. ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల లో జరిగింది. ప్రసన్న లక్ష్మికి.. తిరుపతి అనే వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బెంగుళూర్‌లో భార్య భర్తలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు పుట్టడంతో జాబ్ మానేసింది ప్రసన్న లక్ష్మీ. ఈ నేపథ్యంలో పెళ్లిలో ఇస్తానన్న కట్నం ఇంకా ఇవ్వలేదంటూ భర్త, అత్తమామలు టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని.. మృతురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. నాన్న నా కొడుకుని మా అత్తమ్మ వాళ్లకు ఇవ్వకుండా.. మిరే పెంచండి అంటూ అద్దం మీద రాసింది ఆ మహిళ.. అది చూసి కుటుంబ సభ్యులంత కన్నీరు మున్నీరవుతున్నారు.