BigTV English

Double Ismart Shoot Completed: షూటింగ్ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Double Ismart Shoot Completed: షూటింగ్ పూర్తి చేసుకున్న డబుల్ ఇస్మార్ట్..  రిలీజ్ ఎప్పుడంటే..?

Hero Ram & Director Puri Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పలు డైలాగులను ఇప్పటికీ జనం వాడుతుంటారు. అంతలా ఆ సినిమా హిట్ అయ్యింది. దాని తరువాత హీరో రామ్ నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా సరైన సినిమాలు పడలేదు. అయితే, ఇప్పుడు వీళ్లిద్దరు మరోసారి జతకట్టారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమాపై వీరిద్దరు భారీ ఆశలు పెట్టుకున్నారు.


పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఛార్మీ కౌర్ ఈ సినిమాకు నిర్మాతగా పనిచేస్తున్నారు. సంజయ్ దత్ తో పాటు పలువురు ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అధికారికంగా తెలియజేశారు.

Also Read: ‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో విశ్వక్ కొత్త సినిమా.. కామెడీ ఎట్లుంటదో మరి..!


ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈలోగా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు అందించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×