Hero Satyadev: మామూలుగా ఒక పాన్ ఇండియా మూవీ థియేటర్లలో విడుదల అవుతుందంటే దానికి పోటీగా మరే ఇతర సినిమా విడుదల అవ్వదు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాలకు కనీసం రెండు వారాల పాటు థియేట్రికల్ రన్ సాగుతుంది. అందుకే ఆ సినిమాలతో పోటీ పడడానికి ఇంకా ఏ ఇతర సినిమాలు ముందుకు రావు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలు అయితే ఆ రిస్కే తీసుకోవు. ఇక ‘పుష్ప 2’ సినిమా వల్ల తమ మూవీపై పడిన ఎఫెక్ట్ గురించి యంగ్ హీరో సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నేరుగా చెప్పలేకపోయినా ‘పుష్ప 2’ వల్ల ‘జీబ్రా’పై ఎలాంటి ఎఫెక్ట్ పడిందనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడు సత్యదేవ్.
సత్యదేవ్ స్పందన
ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన సినిమానే ‘జీబ్రా’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సత్యదేవ్ చాలానే కష్టపడ్డాడు. అలా ఈ మూవీపై ప్రేక్షకుల్లో కొంతవరకు హైప్ క్రియేట్ అయ్యింది. థియేటర్లలో ‘జీబ్రా’ విడుదలయిన తర్వాత మూవీకి పాజిటివ్ టాక్ వస్తుందని సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు మేకర్స్. అలా సత్యదేవ్ చాలా రోజుల తర్వాత హీరోగా ఒక క్లీన్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ప్రకటన విడుదలయ్యింది. అప్పుడే ‘జీబ్రా’ మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధమవ్వడంపై హీరో సత్యదేవ్ స్పందించాడు.
Also Read: నో అపాయింట్మెంట్.. అల్లు అర్జున్‌ను పవన్ దగ్గరికి రానివ్వడం లేదా.?
థియేటర్లు లేవు
నవంబర్‌లో ‘జీబ్రా’ మూవీ థియేటర్లలో విడుదలయ్యింది. ఇక డిసెంబర్ 20న ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సత్యదేవ్ ఒక ఈవెంట్‌లో మాట్లాడాడు. ‘‘మా సినిమాకు రెండు వారాల థియేట్రికల్ రన్ దొరికింది. దాని తర్వాత పుష్ప 2 విడుదలయ్యింది. దీంతో మా సినిమాకు అసలు థియేటర్లు లేకుండా పోయాయి. ఇప్పుడు నాలుగు వారాల తర్వాత మా సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఈ గ్యాప్‌తో నేను సంతోషంగానే ఉన్నాను. నా చివరి సినిమా కృష్ణమ్మ అయితే థియేటర్లలో విడుదలయిన వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది’’ అని వివరించాడు సత్యదేవ్.
లేట్ చేయడం అనవసరం
‘పుష్ప 2’ విడుదలయిన తర్వాత ‘జీబ్రా’కు థియేటర్లు తగ్గిపోయాయని చెప్పుకొచ్చాడు సత్యదేవ్. ‘‘అందుకే ఓటీటీ రిలీజ్ లేట్ చేయడం అనవసరం అని అనిపించింది. కాబట్టి పర్వాలేదు’’ అన్నాడు. తను ఈ విషయాన్ని మామూలుగానే చెప్పినా కూడా ‘జీబ్రా’ మూవీ థియేటర్లలో ఎక్కువరోజులు రన్ అవ్వకపోవడానికి ‘పుష్ఫ 2’నే కారణమని చెప్పకనే చెప్పాడు సత్యదేవ్. ‘జీబ్రా’ మాత్రమే కాదు.. ఎన్నో సినిమాలు డిసెంబర్ 5న విడుదలయ్యే ‘పుష్ప 2’కు అడ్డంగా ఉండకూడదని రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నాయి. తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు పోటీగా మరే ఇతర సినిమా విడుదల అవ్వలేదు. అందుకే ‘పుష్ప 2’కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా దానిని చూడడానికి చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.