E-Paper
Advertisement

Srikanth: ఊహతో విడాకులు.. శ్రీకాంత్ రియాక్షన్ ఇదే..

Srikanth: ఊహతో విడాకులు.. శ్రీకాంత్ రియాక్షన్ ఇదే..
Advertisement

Srikanth: టాలీవుడ్‌లో విడాకుల వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అటు మెగా డాటర్ నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ వార్తులు వస్తుంటే.. ఇటు హీరో శ్రీకాంత్ తన భార్య ఊహలు విడిపోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. శ్రీకాంత్, ఊహల మధ్య మనస్పర్ధాలు వచ్చాయని అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలను ఖండించారు.

‘‘సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. ఒకసారి ఏకంగా నేను చచ్చిపోయినట్లు ఫొటో పెట్టి వైరల్ చేశారు. అది చూసినప్పుడు చాలా బాధేసింది. నేను కాబట్టి తట్టుకున్నా.. నా ఫ్యామిలీ చూస్తే తట్టుకోలేరు. ఇక నేను విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నిజానికి నా భార్యకు ఈవెంట్లకు వెళ్లాలంటే ఇష్టముండదు. ఈ వార్తల వల్ల ఇద్దరం కలిసి ఈవెంట్లకు వెళ్లాల్సి వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

శ్రీకాంత్ ఇచ్చిన క్లారిటీతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. ఇకపోతే నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అటు వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడం, ఈవెంట్లకు సింగిల్‌గా వెళ్తుండడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే వారు స్పందించాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×