BigTV English

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Kannappa : శివయ్యా… నీపైనే భారమంతా… కేదారనాథ్ యాత్రలో కన్నప్ప టీం..

Kannappa : మా అధ్యక్షుడు, టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర బృందం బద్రీనాథ్, కేదారనాథ్ వంటి మహాశివుని ఆలయాలను సందర్శించారు.


మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్రను పోషిస్తుండటం అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ప్రభాస్ తో పాటు ఇందులో మోహన్ బాబు, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, లేడీ సూపర్ స్టార్ నయనతార, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం వంటి పలు భాషలను స్టార్ హీరో హీరోయిన్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక డైనమిక్ హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కన్నప్ప టీం కేదారనాథ్, బద్రీనాథ్ లలో సినిమా రిలీజ్ కి ముందు తీర్థయాత్రలు చేపట్టారు. మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు చిత్ర బృందం అంతా కలిసి కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలలో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ మూవీ రిలీజ్ కు ముందు వేస్తున్న ఈ ట్రిప్స్ చూస్తుంటే ‘కన్నప్ప’ (Kannappa) మూవీ భారమంతా ఆ శివయ్య మీదే వేసినట్టుగా కన్పిస్తోంది. నిజానికి మంచు ఫ్యామిలీ సినిమాల పరంగా చాలా వెనకబడిపోయింది. హిట్ అంటే ఏంటో కూడా మర్చిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే మంచు విష్ణు నుంచి సినిమా వచ్చి ఏళ్లు గడిచిపోతోంది. ఈ క్రమంలోనే డూ ఆర్ డై పరిస్థితిలో ఉన్న మంచు ఫ్యామిలీ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాతో సాహసం చేస్తున్నారు. మరి ఈ సినిమాకు శివయ్య దీవెనలు ఎంత వరకు ఉంటాయో తెలీదు కానీ మంచు ఫ్యామిలీ మాత్రం ఆయన మీదే భారమంతా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత కొన్ని నెలల నుంచి సినిమాలోని కీలకమైన పాత్రలకు సంబంధించిన దిగ్గజను నటీనటుల లుక్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి శరత్ కుమార్, మధుబాల, దేవరాజు వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలను పరిచయం చేశారు. అయితే అందరికంటే ఎక్కువగా మూవీ లవర్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న లుక్ ప్రభాస్ ది. రీసెంట్ గా రిలీజ్ చేసిన చిన్న టీజర్ లో జస్ట్ ప్రభాస్ (Prabhas) కళ్ళని మాత్రమే చూపించి ఊరించారు మేకర్స్. అయితే ఆయన పూర్తి లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం కేదార్నాథ్ యాత్రలో ఉండగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×