HBD Varun tej.. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun tej) టాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు. కానీ మెగా వారసుడు అన్న ట్యాగ్ ఈయనపై బలంగా పడింది. ఇకపోతే వరుణ్ తేజ్.. నాగబాబు(Nagababu ), పద్మజ (Padmaja)ల కుమారుడు.. ఈయన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), చిన్నాన్న పవన్ కళ్యాణ్ (Pawan kalyan ) ఒకవైపు స్టార్ హీరోలుగా, మరొకవైపు రాజకీయాలలో కూడా వేగంగా దూసుకుపోతున్నారు. 1991 జనవరి 19వ తేదీన హైదరాబాదులో జన్మించిన వరుణ్ తేజ్.. ఈరోజు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు ఆస్తులు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
వరుణ్ తేజ్ సినిమాలు..
2000వ సంవత్సరంలో హాండ్సప్ అనే సినిమా బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్.. 2014లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా వంటి చిత్రాలతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ సినిమాకు ఏకంగా అవార్డును కూడా అందుకున్నారు వరుణ్ తేజ్. ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi), వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్2’ సినిమాలో మరో హీరోగా నటించి అబ్బురపరిచారు. గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ హీరోగా నటించి ఆకట్టుకున్నారు. అంతేకాదు గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా ఇలా ప్రతి సినిమాతో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం లభించలేదు.
వరుణ్ తేజ్ ఆస్తుల వివరాలు..
వరుణ్ తేజ్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వరుణ్ తేజ్, పలు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ప్రతినెల రూ. 5కోట్ల వరకు ఆదాయం అందుకుంటున్న సంవత్సరానికి రూ.20 కోట్ల వరకు కూడబెడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు సుమారుగా రూ.80 కోట్లకు పైగా తన సొంత కష్టంతో కూడబెట్టినట్లు సమాచారం. ఇకపోతే వరుణ్ తేజ్ కి తన తండ్రి నాగబాబు ద్వారా ఆస్తులు సంక్రమిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రముఖ హీరోయిన్ తో ప్రేమ, పెళ్లి..
ఇకపోతే ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi )ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. 2023 జూన్ 9న హైదరాబాదులోని నాగబాబు ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత అదే ఏడాది నవంబర్ 1న ఇటలీ సీయోనలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది. మరొకవైపు లావణ్య త్రిపాఠి కూడా కథలు వింటూ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కూడా మంచి కథ దొరికితే చేస్తామని హామీ ఇచ్చింది ఈ జంట.