India Squad: శనివారం రోజు ముంబై వంఖడే స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి సంబంధించిన జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టును ప్రకటించిన అనంతరం కోచ్ గౌతమ్ గంభీర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలియజేశారు.
Also Read: SA20 league: ఒరేయ్ ఇలా చేశారేట్రా…ప్చ్ అంటూ చిన్నారి రియాక్షన్ అదుర్స్!
తమ మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు. తాము ఏం చేయాలనుకున్నా, ఏ విషయంలోనైనా మా ఇద్దరికీ చాలా క్లారిటీ ఉంటుందని తెలియజేశారు. ఇక్కడ కూర్చుని తెరవెనక ఏం జరుగుతుందో, గేమ్ లో ఏం జరుగుతుందో తాను వ్యూహాత్మకంగా చర్చించగలనన్నారు. కానీ గౌతమ్ గంభీర్ ఆ విషయంలో చాలా ఆలోచిస్తారని.. మేము ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన తరువాత గంభీర్ మైదానంలో కెప్టెన్ ఏం చేస్తున్నాడో గమనిస్తాడని వివరించారు.
ఒకసారి మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత తాము జట్టు గెలుపోటముల గురించి మాత్రమే ఆలోచిస్తామని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. జట్టు ఎంపిక విషయంలో రెండు విషయాలలో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని తెలుస్తోంది.
రిజర్వ్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ని ప్రకటించాలని గౌతమ్ గంభీర్ పట్టుబట్టారట. కానీ అందుకు సెలక్టర్ అజిత్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకోలేదు. వీరిద్దరూ రిషబ్ పంత్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు జట్టు వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని గంభీర్ కోరారట. దీనికి కెప్టెన్ రోహిత్ శర్మ ఒప్పుకోలేదని సమాచారం. జట్టు భవిష్యత్తు రీత్యా గిల్ వైపే రోహిత్ శర్మ మొగ్గు చూపారట.
ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ నిరాశకు గురయ్యారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు జనవరి 23 నుంచి జమ్మూ కాశ్మీర్ తో ముంబై జట్టుకు జరిగే దేశవాళీ క్రికెట్ లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు రోహిత్ శర్మ. మరోవైపు తాజాగా ప్రకటించిన ఈ జట్టులో స్టార్ పేసర్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ.. అతడు బరిలోకి దిగే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.
Also Read: Kho Kho World Cup final: ఖో ఖో వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత ఇరుజట్లు.. నేపాల్ తో అమీతుమీ!
ఆస్ట్రేలియా పర్యటనలో వెన్నునొప్పికి గురైన బుమ్రా 5 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో అతడి గాయం పై స్పష్టత వస్తుందని.. ఆ సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఒకవేళ బుమ్రా గైర్హాజరైతే అతడి స్థానంలో హర్షిత్ రాణాను ఆడిస్తామని పేర్కొన్నాడు. బుమ్రా గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడో చెప్పడం మన చేతులలో లేదని వెల్లడించారు అగర్కర్.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Here are the reasons for the long meeting during yesterday’s Champions Trophy squad announcement 👇
🔹 Gautam Gambhir wanted Hardik Pandya as vice-captain.
🔸 Rohit Sharma and Ajit Agarkar want Shubman Gill as vice-captain.
🔹 Gautam Gambhir is in favour of… pic.twitter.com/HK43jDpTLB— Sportskeeda (@Sportskeeda) January 19, 2025