Sankranthiki Vasthunnam 1st Day Collections: ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో, టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు (Dilraju) నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు అటు ఓవర్సీస్ లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగానే కలెక్షన్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా స్టోరీ పెద్దగా ఆకట్టుకోకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమా తీసినట్టు తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి మొదటి రోజు కలెక్షన్లు ఎంత అనే విషయం ఇప్పుడు మేకర్స్ పోస్టర్ తో సహా రిలీజ్ చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్..
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు పోస్టర్ తో సహా వెల్లడించారు. వెంకటేష్ కి ఇదే ఆల్ టైం కెరియర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని కూడా సమాచారం. మొత్తానికైతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి తన ఖాతాలో విజయాన్ని వేసుకున్నారు వెంకటేష్ అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వెంకటేష్ సినీ కెరియర్..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి దివంగత లెజెండ్రీ నిర్మాత, మూవీ మొఘల్ గా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు(Daggubati Ramanaidu) వారసుడిగా అడుగుపెట్టారు. అలా ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన వెంకటేష్, ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా ఇప్పటికీ తన సినిమాలతో మాస్, యాక్షన్, పర్ఫామెన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా పండించి, మరింత దగ్గరయ్యారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆల్ టైం ఫేవరెట్ హీరో వెంకటేష్ అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈయనతో పాటు మరో ముగ్గురు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బాలకృష్ణ(Balakrishna ), నాగార్జున (Nagarjuna) కూడా ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఈ ఏడాది మే నెలలో ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చేస్తున్న ‘విశ్వంభర’ సినిమా విడుదల చేస్తున్నారు.అలాగే నాగార్జున (Nagarjuna) కూడా సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikath ) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాబీ డియోల్ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేసి ఆయన కూడా పరవాలేదని అనిపించుకున్నారు. ఇలా ఈ వయసులో కూడా ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు మంచి విజయాలను అందుకుంటూ కొత్తవారికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు కూడా. మొత్తానికైతే వెంకటేష్ సంక్రాంతి బరిలో దిగి మొదటి రోజు రూ.45 కోట్లు రాబట్టి అభిమానులకు మంచి సంతోషాన్ని మిగిల్చారని చెప్పవచ్చు. ఏదేమైనా పండుగ పూట ఒక మంచి సినిమా చూశామని ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.