BigTV English

Kidney Health: ఈ 3 అలవాట్లు కిడ్నీలను పాడు చేస్తాయి, మీరూ ఇలానే చేస్తున్నారా ?

Kidney Health: ఈ 3 అలవాట్లు కిడ్నీలను పాడు చేస్తాయి, మీరూ ఇలానే చేస్తున్నారా ?

Kidney Health: మన శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సరిగ్గా తినడంతో పాటు సరైన మొత్తంలో నీరు త్రాగడం వంటి రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. శరీరానికి సరిపడా నీరు తాగితే అనేక పోషకాల లోపాన్ని భర్తీ చేయవచ్చు. ఇదే కాకుండా నీరు శరీరం నుండి పేరుకుపోయిన మురికితో పాటు వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే అన్నిటిలాగే నీరు కూడా మీకు హాని కలిగిస్తుందని తెలుసా ? అవును త్రాగునీటికి సంబంధించిన కొన్ని చెడు అలవాట్లు మీ శరీరంపై ముఖ్యంగా మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.మీరు కూడా తెలిసి లేదా తెలియక ఈ తప్పులు చేస్తుంటే..గనక వాటిని వెంటనే సరిదిద్దుకోండి.


చాలా తక్కువ నీరు త్రాగడం:
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. అలాగే, కిడ్నీలు బాగా పనిచేయడానికి సరైన మొత్తంలో నీరు చాలా అవసరం. వాస్తవానికి చాలా తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పరిమాణం పెరుగుతుంది. అంతే కాకుండా ఇది మూత్రపిండాలలో చిక్కుకుపోతుంది. ఈ పరిస్థితిలో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందుకే చలికాలమైనా, వేసవికాలమైనా మీ వయస్సును బట్టి సరైన మోతాదులో నీటిని తాగండి.

నీరు ఎక్కువగా తాగడం కూడా హానికరం:
తక్కువ నీరు తాగినా ప్రమాదమే.. అలాగని ఎక్కువ నీరు తాగడం కూడా హానికరం. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం, ప్రతిరోజు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలనే నియమం అందరికీ వర్తించదు. ఒక్కోకరి శరీరం ఒక్కోలా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్య పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ప్రతిరోజు త్రాగే నీటి పరిమాణం వ్యక్తి వయస్సు, వాతావరణం, శారీరక శ్రమ స్థాయి మొదలైన అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు చదివిన లేదా వినే వాటిని విశ్వసించకుండా మీ శరీరాన్ని గమనించండి. నీటి విషయంలో మీ ఆరోగ్య నిపుణుల నుండి సలహాలను కూడా తీసుకోండి.


Also Read: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. అద్భుత ప్రయోజనాలు

నిలబడి నీళ్లు తాగకూడదు:
ఈ రోజుల్లో హాయిగా కూర్చుని నీళ్లు తాగడానికి కూడా ఎవరికీ సమయం లేదు. అందరూ హడావుడిగా నీళ్లు తాగుతుంటారు. అయితే ఈ అలవాటు అనేక విధాలుగా ఆరోగ్యానికి చాలా హానికరం. వాస్తవానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం నిలబడి నీటిని తాగినప్పుడు, నీరు సరిగ్గా ఫిల్టర్ చేయకుండా త్వరగా శరీరం యొక్క దిగువ భాగం వైపు కదులుతుంది. ఈ సమయంలో నీటిలో ఉండే మలినాలు పిత్తాశయంలో పేరుకుపోతాయి. దీంతో యూటీఐ ఇన్‌ఫెక్షన్‌, కిడ్నీలు దెబ్బతినడం వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×