Game Changer: ఈరోజుల్లో ఒక సినిమా విడుదల అవ్వగానే అది వెంటనే పైరసీ సైట్స్‌లో వచ్చేయడం పెద్ద విషయం కాదు. థియేటర్లలో మార్నింగ్ షో పూర్తవ్వగానే హెచ్‌డీ ప్రింట్ చాలావరకు వెబ్‌సైట్స్‌లో వచ్చేస్తుంది. దాని వల్ల నిర్మాతలు నష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. చాలామంది ప్రేక్షకులు సైతం వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్న హెచ్‌డీ ప్రింట్ చూసేసి థియేటర్లకు రావడం మానేస్తున్నారు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన హెచ్‌డీ ప్రింట్ లీక్ అవ్వడంపై సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించారు నిర్మాతలు. ఈ లీక్ వెనుక ఓ ఇద్దరి హస్తం ఉందని ఇండస్ట్రీలో షాకింగ్ విషయం బయటపడింది.
అంతా ఆ ఇద్దరే.?
‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదలయిన రోజే హెచ్‌డీ ప్రింట్ బయటికొచ్చింది. దానికి తగిన చర్యలు తీసుకొని ఆ ప్రింట్‌ను ఆన్‌లైన్ నుండి తొలగించేలా చేశారు నిర్మాతలు. కానీ వెంటనే మళ్లీ ఈ ప్రింట్ బయటికొచ్చింది. దీంతో నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారని, ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే ఇంతలోనే ఈ హెచ్‌డీ ప్రింట్ లీక్ వెనుక టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖల హస్తం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ విషయంలో కూడా వారు ఇలాగే చేశారని తెలుస్తోంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’పై కూడా అదే స్ట్రాటజీ ఉపయోగించారట.
టార్గెట్ చేసి మరీ నెగిటివిటీ..
నిర్మాతలకు నష్టం మిగిల్చి ఇండస్ట్రీ మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకోవడం కోసమే ఆ ఇద్దరు ఇలా చేస్తున్నారని కొందరు ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు తాము చేసిన పని వల్ల ‘గుంటూరు కారం’ నిర్మాతకు ఎలా అయితే నష్టం కలిగేలా చేశారో.. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో దిల్ రాజుకు కూడా అలాంటి నష్టమే రావాలని వారు టార్గెట్‌గా పెట్టుకున్నారట. వీరు ఇలా చేయడం వెనుక బలమైన కారణం కూడా ఉందని సమాచారం. పలువురు ఇతర నిర్మాతలు, హీరోల దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఈ ఇద్దరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై ‘గేమ్ ఛేంజర్’ నిర్మాతలు చాలా సీరియస్‌గా ఉన్నారు.
Also Read: ‘గేమ్ ఛేంజర్’ ఔట్‌పుట్‌తో సంతోషంగా లేను.. అదేంటి శంకర్ అంత మాట అనేశారు.?
హీరో ఫ్యాన్ ఇంఛార్జ్ కూడా.?
ఈ ఇద్దరు ఇలా చేయడం వెనుక పలువురు బడా సెలబ్రిటీలు మాత్రమే కాదని.. కులానికి సంబంధించిన విభేదాలు కూడా కారణమే అని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ‘గేమ్ ఛేంజర్’ మూవీ లీక్ విషయంలో మరికొందరు కూడా ముఖ్య పాత్ర పోషించినట్టు సమాచారం. ఒక ప్రముఖ హీరో ఫ్యాన్ ఇంఛార్జ్, ఒక ట్విటర్ హ్యాండిల్ లాంటివి ఈ ఇద్దరికి సపోర్ట్ చేసి ‘గేమ్ ఛేంజర్’కు నష్టం కలిగేలా చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని తెలుస్తోంది. నిర్మాతలు ఇచ్చిన సైబర్ క్రైమ్ కంప్లైంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ ఇద్దరు పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని ఇండస్ట్రీ నిపుణులు ఫీలవుతున్నారు.
గతంలో గుంటూరు కారం..
గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీకి కూడా నెగిటివిట్ టాక్ స్ప్రెడ్ అయింది. దీన్ని ఆ మూవీ నిర్మాత నాగవంశీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ టైంలోనే ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్న ఆ ఇద్దరి గురించి తెలుసుకున్నాడు. అంతే కాదు.. తన వద్దకు రాకుండా ఆ ఇద్దరిని దూరం చేశాడని టాక్. ఇప్పుడు నాగ వంశీ నిర్మించే సినిమాలకు ఆ ఇద్దరికి సంబంధం లేకుండా రిలీజ్ అవుతున్నాయట.
Also Read: మిక్స్ డ్ టాక్ తో రామ్ చరణ్ ఊచకోత.. నాలుగు రోజులకు ఎన్ని కోట్లంటే?
ఇండస్ట్రీలో మోనోపోలి.?
అయితే ఈ వ్యవస్థలో మోనోపోలి నడుస్తుందని చాలా రోజుల నుంచి వాదన వినిపిస్తుంది. కొంత మంది ఇండస్ట్రీలో డామినేషన్ క్రియేట్ చేస్తున్నారట. హీరోలకు ఆ కొంత మందితో డీల్ చేసుకోవడం ఇష్టం లేకున్నా.. వారికి వేరే ఆప్షన్ లేకపోవడంతో మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్తున్నారని టాక్ వస్తుంది.