BigTV English

Thangalaan Movie: తంగలాన్ మూవీలో విక్రమ్ సాహస విన్యాసాలు, అదుర్స్‌..

Thangalaan Movie: తంగలాన్ మూవీలో విక్రమ్ సాహస విన్యాసాలు, అదుర్స్‌..

Hero Vikram Latest Periodic Drama Movie Thangalaan Latest Updates: తమిళ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విభిన్నమైన మూవీస్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌ని సంపాదించుకున్నాడు. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా, విక్రమ్ 2016 మరియు 2018కి ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చేర్చబడ్డాడు. అంతేకాదు తాను యాక్ట్ చేసే మూవీస్‌లో కొత్తగా తన రోల్స్ ఎంచుకుంటూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తుంటాడు. ఇక విక్రమ్ విషయానికి వస్తే..గతంలో ఈయన యాక్ట్ చేసిన మూవీ శివపుత్రుడు.ఈ మూవీలో చాలా డిఫరెంట్‌గా ఎప్పుడు చూడని పాత్రలు చేస్తూ ఆడియెన్స్ చేత విజిల్స్ వేసేలా చేసుకున్నాడు.ఇక ఆ తరువాత ఐ మూవీ, అపరిచితుడు వంటి వైవిధ్యమైన మూవీస్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు ఈ మూడు మూవీస్‌తో టాలీవుడ్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు.


ఇటు తమిళ్‌, అటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ స్టార్‌డమ్ తెచ్చుకున్నారు.ఇక ఇదిలా ఉంటే..విక్రమ్ తాజాగా యాక్ట్ చేసిన మూవీ తంగలాన్.ఈ మూవీలో డిఫరెంట్ రోల్‌తో అలరించడానికి ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నాడు. గతంలో కాలా, కబాలి వంటి మూవీస్ రూపొందించిన దర్శకుడు పా. రంజిత్ తంగలాన్ మూవీకి ఈయన దర్వకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీని తనదైన శైలిలో అబ్బురపడేలా ఈ మూవీని చిత్రీకరిస్తున్నారిని యూనిట్ వర్గాలు చెప్పారు. అంతేకాదు ఈ మూవీ నుండి రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్‌లో డైరెక్ట్ చూడాల్సిందే.ఎందుకంటే ఈ మూవీ అంతలా కంటెంట్ ఉండబోతోందని విక్రమ్ ఫ్యాన్స్‌ చెబుతున్నారు.ఇక తంగలాన్ మూవీలో ముఖ్యంగా చెప్పాలంటే గోల్డ్‌ నిధుల నేపథ్యంలో జరిగే యథార్థ సంఘటనలతో తీసిన మూవీగా అర్థమవుతోంది. అంతేకాకుండా ఈ మూవీలో అదిరిపోయే విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

Also Read: కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌ల పెళ్లి, వైరల్‌ ఫొటోస్‌


ఈ మూవీ మేకింగ్‌లో కూడా చాలా హైఫైగా ప్రొడక్షన్ క్వాలిటీస్ మనకు స్పష్టంగా కనిపిస్తాయని టాక్. అంతేకాదు విక్రమ్ ఈ మూవీలో గోండు జాతికి చెందిన వీరుడిలాగా ఈ మూవీలో అలరించనున్నాడు. అంతేకాదు ఈ మూవీ తన కెరీర్‌లోనే చేయనటువంటి వైవిథ్యమైన రోల్ ఇందులో చేయనున్నాడు. ఈ రోల్ కోసం విక్రమ్ ప్రత్యేకంగా డైట్ మెయింటైన్ చేసినట్లు, అంతేకాదు ఈ మూవీ కోసం విక్రమ్ కంప్లీట్‌గా కొన్ని రోజుల పాటు ఉపవాసాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ రోల్ కోసం విక్రమ్ చాలా కఠినమైన రోల్స్ చేశాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ ఉపవాసాలు ఉండి ఆయన తన వెయిట్‌ని కంప్లీట్‌గా తగ్గించుకున్నాడు. ఇక తంగలాన్ మూవీ ట్రైలర్ విషయానికొస్తే.. ఒక ఫారెస్ట్ ప్రాంతంలో బంగారు నిధులు ఉన్నాయని బ్రిటీషర్లు గుర్తించి అక్కడి గోండు జాతి ప్రజలను సహాయం కోరుతారు. ఈ క్రమంలో గుప్తనిధుల తవ్వడం మొదలు పెడుతారు. అప్పుడు అక్కడి ప్రజలు ఎదుర్కొనే ప్రమాదాల నుండి తమ ప్రాణాలకు తెగించి ఆ జాతిని కాపాడుకునే పాత్రలో విక్రమ్ నటించాడు. కాదు కాదు జీవించాడనే చెప్పాలి.తన నటనతో నిజమైన గోండు బిడ్డగా ఓ రేంజ్‌కి వెళ్లిపోయాడని అంటున్నారు మూవీ పెద్ధలు. ఇక ఈ మూవీలో హీరోయిన్లు మాళవిక మోహనన్, పార్వతీలు యాక్ట్ చేయగా.. ఈ మూవీ ఆగష్టులో రిలీజ్‌ అయ్యేందుకు రెడీగా ఉంది

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×