BigTV English

Kiran Abbavaram: స్థాయి అంటూ కిరణ్ ను అవమానించిన రిపోర్టర్.. ఇచ్చిపడేసిన యంగ్ హీరో

Kiran Abbavaram: స్థాయి అంటూ కిరణ్ ను అవమానించిన రిపోర్టర్.. ఇచ్చిపడేసిన యంగ్ హీరో

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక కిరణ్ ఈ మధ్యనే క అనే పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. సుజీత్‌, సందీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో క సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ లంచ్ ఈవెంట్ లో కిరణ్ ను ఒక రిపోర్టర్  అవమానించడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు కానీ, మీస్థాయిలో ఉన్నటువంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్..? మీ తెలుగులోనే సక్సెస్ లేదు అని మీరే చెప్పారు.. ? మరి ఇప్పుడు మీరు పాన్ ఇండియా సినిమాను ఎలా ఎంచుకున్నారు .. ? అన్న ప్రశ్నకు కిరణ్ మాట్లాడుతూ.. “స్థాయి అంటే కంటెంటే.. ఏదైనా స్థాయి అంటే కంటెంటే. మొన్న మలయాళం నుంచి వచ్చిన మంజుమెల్ బాయ్స్ ను మనమందరం హిట్ చేశాం. ఆ యాక్టర్స్ పేరు ఎవరికైనా తెలుసా .. ? కాంతార సినిమా వచ్చాకనే రిషబ్ శెట్టి గురించి తెలిసింది.


ఇక్కడ నా స్థాయి పెద్దదా.. ? చిన్నదా.. ? అనేది సెకండరీ. కంటెంటే ఫస్ట్. మనం ఆ సినిమాకు ఇచ్చే కంటెంట్ కు స్థాయి ఉందా లేదా అనేది మ్యాటర్. కంటెంట్ ఉంటే మీరిద్దరూ ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ క అనే సినిమాలో కంటెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే వేరే భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం తప్ప వేరే ఏమి లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రిపోర్టర్  ప్రశ్నపై ఫైర్ అవుతున్నారు.

ఇదే ప్రశ్న పెద్ద హీరోలను అడగగలుగుతారా.. ? అని కొందరు. ఎలాంటి ప్రశ్నలు వేయాలో కూడా తెలియనివారు జర్నలిస్టులు అవుతున్నారు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో కిరణ్ ఆ స్థాయిని అందుకుని వారి నోళ్లు మూయిస్తాడో లేదో చూడాలి.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×