Hero Yash:ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ పెరుగుతోందంటే దానికి కారణం హీరోలు, అందులో నటించే నటీనటుల రెమ్యూనరేషన్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. దీనికి తోడు ఇప్పుడు అందులో కీలక పాత్రల్లో పోషించే నటీనటులు కూడా పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు హీరోగా కాకుండా విలన్ గా నటిస్తూ హీరోకి మించిన రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు కన్నడ స్టార్ హీరో యష్ (Yash). సీరియల్స్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన కేజీఎఫ్(KGF )సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు.
విలన్ పాత్ర కోసం రూ.200 కోట్లు..
ప్రస్తుతం ఈయన హిందీ రామాయణం సినిమాలో రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం యష్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విలన్ గా నటించడం కోసం ఏకంగా రూ.200 కోట్లు తీసుకున్నారట. ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి(Sai pallavi)సీతగా, రణబీర్ కపూర్ (Ranbeer Kapoor)రాముడిగా నటిస్తున్నారు. మరి వారి పారితోషకాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఇందులో రావణుడి పాత్రలో విలన్ గా నటించడం కోసం పెద్ద మొత్తంలో తీసుకున్నారట. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. అలాంటిది విలన్ పాత్రకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అంటే నిజంగా ఈయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
హీరో యష్ కెరియర్..
నవీన్ కుమార్ గౌడ్ గా కర్ణాటక భువనహల్లిలో 1986 జనవరి 8న జన్మించారు వినతండ్రి అరుణ్ కుమార్ కె ఎస్ ఆర్ టి సి రవాణా సేవలు డ్రైవర్గా పనిచేస్తున్నారు తల్లి పుష్పలత అంతేకాదు నందిని అనే ఒక చెల్లెలు కూడా ఉంది ఈయన చిన్ననాటి రోజుల్లో మైసూర్ లో ఉండేవారు. అక్కడే మహాజన హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన చదువు పూర్తయిన తర్వాత నాటక రచయిత బివికరాంత్ స్థాపించిన వెనక డ్రామా బృందంలో చేరాడు అలా టీవీ సీరియల్స్ షోలతో అరంగేట్రం చేసిన ఆ తర్వాత ఇండస్ట్రీకి గాయకుడిగా పరిచయమయ్యారు.
టీవీ సీరియల్ తో ప్రారంభం..
2004లో ఉత్తరాయణ అనే టీవీ సీరియల్ ద్వారా కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత నందాగోకుల, ప్రీతి ఇల్లాడ మేలే, శివలలో వంటి సీరియల్స్ లో నటించారు.. ఇక తర్వాత కన్నడ సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. 2007లో వచ్చిన “జంబాడ హుడిగి” అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈయన కే జి ఎఫ్ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకుని ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు హిందీ రామాయణంలో విలన్ గా కూడా నటిస్తున్నారు.