అమెరికాలోని అత్యతం దారుణం జరిగింది. న్యూయార్క్ సబ్ వేలో ఓ దుండగుడు నిద్రిస్తున్న మహిళకు నిప్పటించాడు. ఆమె మంటల్లో తగలబడుతుంటే అక్కడే కూర్చొని చూసి ఎంజాయ్ చేశాడు. ఆదివారం ఉదయం బ్రూ క్లిన్ లోని స్టిల్ వెల్ అవెన్యూ దగ్గర లైన్ చివరలో ఉన్న F ట్రైన్ దగ్గర ఈ ఘటన జరిగింది. రైలు స్టేషన్ లో ఆగి ఉన్న సమయంలో నిందితుడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. సదరు మహిళ మంటల్లో కాలుతూ బాధ తట్టుకోలేక, రైళ్లోకి వెళ్లింది. ఆమె మంటల్లో కాలుతుంటే, సైకో రైల్వే స్టేషన్ లోని బెంచీ మీద కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఆ సమయంలో రైల్లో ప్రయాణీకులు ఎవరూ లేరని అధికారులు వెల్లడించారు. కాసేపటి తర్వాత నిందితుడు అక్కడి నుంచి మరో రైల్లో వెళ్లిపోయాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం తప్పదా?
అమెరికాలో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితుడు గ్వాటెమాల నుంచి వలస వచ్చిన సెబాస్టియన్‌గా గుర్తించారు. అతడు 2018లో అరిజోనా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య, మనిషిని సజీవ దహనం చేసినందుకు పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో అమెరికాలో అక్రమ వలసదారుల కారణంగా శాంతి భద్రతల సమస్యలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా సరిహద్దు దాటుతున్న వారిలో కరుడుగట్టిన నేరస్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలా వచ్చిన వాళ్లే అమెరికాలో దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసదారుల అంశం తీవ్రంగా చర్చనీయాంశమైంది.
🚨🇺🇸HORRIFIC SUBWAY ATTACK: WOMAN BURNED TO DEATH IN NYC
A man set a sleeping woman on fire inside a Coney Island F train, then calmly watched as she burned to death in a shocking attack.
The horrifying incident occurred Sunday morning at the Coney Island-Stillwell Avenue… pic.twitter.com/nr79QrHXML
— Mario Nawfal (@MarioNawfal) December 22, 2024
సబ్‌వేలలో పెరిగిన నేరాలు
వాస్తవానికి గత కొంతకాలంగా సబ్ వేలలో హింసాత్మక ఘటను జరుగుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో ఐదు హత్యలు జరిగితే, ఈ సంవత్సరం నవంబర్ నుంచి తొమ్మిది హత్యలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా నేరాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో సబ్ వేలలో భద్రత పెంచుతున్న స్థానిక అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ నేరాలు తగ్గకపోగా, పెరగడం విమర్శలకు దారితీస్తున్నది.
గవర్నర్ రాజీనామాకు ఎలన్ మస్క్ డిమాండ్
న్యూయార్క్ సబ్ వేలో జరిగిన దారుణ ఘటపై పలువురు ప్రముఖు స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు ఆమె బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సబ్ వేలలో భద్రత పెంచుతున్నట్లు గవర్నర్ వెల్లడించినా, అదే రోజు మరో ఇద్దరు ప్రయాణీకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె వెంటనే పదవి నుంచి రీకాల్ చేయాలని ఎలన్ మస్క్ డిమాండ్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా ఆమెను రిజైన్ చేయాలని కోరుతున్నారు.
Read Also: మహిళకు నిప్పు.. మంటల్లో కాలిపోతుంటే చూసి ఎంజాయ్ చేసిన కిరాతకుడు!