10 Years for Mukunda : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే అన్ని సినిమాలలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ముకుంద సినిమా కొంచెం ప్రత్యేకం అని చెప్పాలి. వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా, మంచి ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా విలేజ్ పొలిటికల్ డ్రామాను శ్రీకాంత్ అడ్డాల చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లో ఈ సినిమా ఒక బెస్ట్ వర్క్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డల రాసిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ప్రతి డైలాగ్ ను ఫిజిక్స్ కి లింక్ చేస్తూ శ్రీకాంత్ రాసిన విధానం అప్పట్లో చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రావు రమేష్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఆ పాత్రతో చెప్పించిన డైలాగ్స్ ఇవన్నీ కూడా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి.
కేవలం రావు రమేష్ పాత్ర మాత్రమే కాకుండా ప్రకాష్ రాజ్ పాత్రను కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. అలానే ఈ సినిమాకి మిక్కి జే మేయర్ అందించిన సంగీతం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిపాటికి అర్థం పరమార్థం ఉండేలా రాశారు శాస్త్రి. శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక వరుణ్ తేజ్ క్యారెక్టర్ విషయానికొస్తే అద్భుతమైన డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యూలేషన్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాతో పూజ హెగ్డే కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పూజా హెగ్డే మరియు వరుణ్ తేజ్ మధ్య కెమిస్ట్రీ ని కూడా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇద్దరినీ క్లైమాక్స్ వరకు ఒకరిని ఒకరు కలవకుండా చూపించాడు.
ముకుంద సినిమా తర్వాత ఇప్పటివరకు శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లో హిట్ సినిమా పడలేదు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమా బ్రహ్మోత్సవం. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత దాదాపు చాలా ఏళ్లపాటు శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయలేదు. అసురన్ సినిమాని తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకుడుగా చేసిన సినిమా పెదకాపు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఏదేమైనా ముకుంద సినిమాకి నేటితో పదేళ్లు పూర్తవడంతో పాటు ప్రాపర్ హిట్ సినిమా శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లో పడి పదేళ్లు అయిందని చెప్పాలి.
Also Read : 10 Years for Varun Tej : పదేళ్ళ జర్నీ లో ఎన్నో కన్సెప్ట్ బేస్ సినిమాలు