Game Changer : గత మూడేళ్ల నుంచి మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఊహించని విధంగా ఈ సినిమాకు సంబంధించి ‘డిజాస్టర్ గేమ్ ఛేంజర్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అన్ ప్రెడిక్టబుల్ రియాక్షన్
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ లీడ్ రోల్స్ పోషించిన భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి ప్రేక్షకుల నుంచి అన్ ప్రేడిక్టబుల్ రియాక్షన్ వస్తుండడం ఆందోళనకరంగా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో “డిజాస్టర్ గేమ్ చేంజర్” అనే హ్యాండ్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజెన్లు శంకర్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ట్రోల్స్, మీన్స్ తో ఇది మాత్రం అన్ ప్రెడిక్టబుల్ అంటూ సెటైరికల్ గా ఇచ్చి పడేస్తున్నారు. శంకర్ ఔటేటెడ్ అయ్యాడని, నిర్మాతలు అనవసరంగా అతనిని నమ్మి కోట్లు కుమ్మరిస్తున్నారని దారుణంగా శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. చెర్రీ అభిమానులు మూవీతో హ్యాపీగానే ఉన్నప్పటికీ, మిగతా వాళ్ళు మాత్రం ఈ మూవీలో అసలు శంకర్ మార్క్ లేదని, ‘ఒకే ఒక్కడు’ మూవీకి కాపీలా ఉందని తిట్టిపోస్తున్నారు.
రాజమౌళి సెంటిమెంట్ తెరపైకి…
ఈ నేపథ్యంలోనే ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ వల్ల రాజమౌళి (Rajamouli) సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. సాధారణంగా రాజమౌళితో ఏ హీరో సినిమా చేసిన సరే… ఆయన రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసే సినిమాలు డిజాస్టర్ గా మారతాయి. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో రామ్ చరణ్ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయాడని అంటున్నారు. నిజానికి ఈ సెంటిమెంట్ ని ఇప్పటిదాకా ఒక్క ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.
జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ‘దేవర’ మూవీతో రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి అదొక మిత్ మాత్రమే అనిపించేలా చేశారు. కానీ మరోసారి ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ కావడంతో మళ్లీ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కానీ రాజమౌళి అభిమానులు మాత్రం దీన్ని ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఆ సెంటిమెంట్ మాత్రం నిజమైతే ఎన్టీఆర్ ఎలా బ్రేక్ చేయగలిగాడంటూ లాజిక్ లాగుతున్నారు. ఇదంతా శంకర్ తప్పే అంటూ డైరెక్టర్ ను బ్లేం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది ? ఈ నెగెటివ్ ట్రెండ్ ఎఫెక్ట్ కలెక్షన్ల పై ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది