Hebba Patel:ప్రముఖ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebba patel) తన అందంతో, అద్భుతమైన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఈ మధ్యకాలంలో ఉన్నత స్థానానికి చేరుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని చెప్పవచ్చు. రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ‘కుమారి 21ఎఫ్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసి కుర్రకారుని ఒక్కసారిగా తన వశం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు హీరో రాజ్ తరుణ్ కంటే హెబ్బా పటేల్ కే మంచి పేరు వచ్చింది. దీంతో ఈమె టాలీవుడ్ లో పెద్ద రేంజ్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈమెకు అవకాశాలు లేకుండా పోయాయి. ఇకపోతే చివరిగా ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు ‘ఓదెలా 2’లో కూడా నటించింది.
రాజ్ తరుణ్ పై హెబ్బా పటేల్ ఊహించని కామెంట్స్..
ఇకపోతే ఈ సినిమాతో హెబ్బా పటేల్ మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ.. రాజ్ తరుణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలే రాజ్ తరుణ్ పై లావణ్య (Lavanya)ఆరోపణలు చేస్తూ ఆయనను పూర్తిగా బ్యాడ్ చేసిన సమయంలో ఇప్పుడు హెబ్బా పటేల్ మాట్లాడిన మాటలు కాస్త ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక రాజ్ తరుణ్ తో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలో ఎవరి దగ్గర అయితే పూర్తిస్థాయిలో కంఫర్ట్ గా ఫీల్ అయ్యానో అది కేవలం రాజ్ తరుణ్ దగ్గర మాత్రమే. అతని దగ్గర ఒక్కటే నేను నాలాగే ఉండగలిగాను. నాకు తెలుగు కూడా ఎక్కువగా వచ్చేది కాదు. ఆ సమయంలో నాకు తెలుగు నేర్పించడంలో రాజ్ తరుణ్ చాలా సహాయపడ్డాడు. అంతే కాదు రాజ్ తరుణ్ తో నాకు ఎన్నో క్యూట్ మూమెంట్లు కూడా ఉన్నాయి. అవి తలుచుకుంటే ఇప్పటికీ సంతోషంతో పాటు బాధ కూడా వేస్తోంది..సినిమా షూటింగ్ అయిపోయి.. ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు.. ఆ క్షణం తట్టుకోలేకపోయాను.. నరకం అనుభవించాను. కానీ రాజ్ తరుణ్ ఒక మంచి వ్యక్తి”అంటూ రాజ్ తరుణ్ పై హెబ్బా పటేల్ పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో ఆయనకి గట్టి స్వాంతన కలిగింది అని చెప్పవచ్చు. ఈ మధ్య నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్న వేళ ఇలాంటి పాజిటివ్ కామెంట్లు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
నేను కూడా లవ్ ఫెయిల్యూర్నే..
ఎవరినైనా ప్రేమించారా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. “ప్రేమించాను కానీ ఆ ప్రేమ నాతో ఎక్కువగా నిలవలేదు. నేను కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ ని. నా లవ్ బ్రేకప్ అయినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను. నరకం చూసాను. నాలో నేను ఎంతగా కుమిలిపోయానో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది”. అంటూ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తితోనే తాను ప్రేమలో పడినట్లు ఆమె తెలిపింది.
ALSO READ:Padma Awards: అజిత్ కు పద్మభూషణ్.. విజయ్ చీప్ పాలిటిక్స్? ఆ రోజే ఎందుకు?