BigTV English
Advertisement

Jyothika : బాలీవుడ్ నేర్చుకుంది.. సౌత్ ఇంకా మారలేదు.. పరువు తీసేసిన హీరోయిన్..

Jyothika : బాలీవుడ్ నేర్చుకుంది.. సౌత్ ఇంకా మారలేదు.. పరువు తీసేసిన హీరోయిన్..

Jyothika : తమిళ్ స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె చేసిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దానివల్లే తెలుగులో కూడా ఈమెకు అభిమానులు ఉన్నారు.. ఇటీవల కుటుంబంతో సహా ముంబైకి షిఫ్ట్ అయినా జ్యోతిక బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సినిమాలు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. జ్యోతిక మొదటి చిత్రం డోలీ సజా కే రహ్నా, ఇది 1998లో హిందీలో విడుదలైంది.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ లో జ్యోతిక పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఆమె ధూమపానం చేసే సన్నివేశాల్లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సౌత్ ఇండస్ట్రీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. అసలు జ్యోతిక ఏమందో ఒకసారి తెలుసుకుందాం..


ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడితూ.. జ్యోతిక స్త్రీ పాత్రల ప్రాధాన్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన వెబ్ సిరీస్‌లోని 80 శాతం తారాగణం మహిళలే అని తెలిపింది అలాగే.. ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా, దక్షిణ భారత పురుషులపై దృష్టి సారించే చిత్రాలతో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు మార్పులు వచ్చాయి. బాలీవుడ్‌ లో కూడా మార్పు వచ్చింది..ఇంకా సౌత్ లో ఆ మార్పు రాలేదు. పురుష పాత్రలను బలమైన రీతిలో రాస్తారు. అందులో స్త్రీ పాత్రలు పూర్తి కావు. ముఖ్యంగా స్త్రీలు డాన్స్ చేయడానికి, హీరోలను ప్రశంసించడానికి అలవాటు పడ్డారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాంటి చాలా సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి. వాటిల్లో కూడా నేను నటించాను అను ఆమె అన్నారు..

Also Read : అరె ఏంట్రా ఇది.. మరీ ఇలా తయారయ్యేంట్రా బాబు..


అలాంటి సినిమాలు నాకు ఇబ్బంది గా అనిపించేవి నేను సాధించింది ఏమీ లేదు అని నాకు అనిపించింది అందుకే నా ధోరణి మార్చుకున్నాను. సినిమాలు ఉండాలని ఆలోచించాను.. నటనకు ముఖ్యమైన పాత్రలను ఎంచుకోవడం ప్రారంభించాను. అదే నన్ను ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఆమె అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటుడు సూర్యుతో వివాహం తర్వాత కొంత కాలం సినిమాల కు దూరంగా ఉన్న జ్యోతిక ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. తమిళ్లో తెలుగులో పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. అటు సూర్య కూడా వరుసగా సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం జ్యోతిక మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారింది.. సౌత్ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు ఆమెపై మండిపడుతున్నారని తెలుస్తుంది. కొందరు నెటిజన్లు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.. మరి దీనిపై జ్యోతిక రియాక్ట్ అవుతుందేమో చూడాలి..

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×