CM Revanth Reddy: హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీకి వందేళ్ల చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోఠి ఉమెన్స్ యూనివర్సిటీనికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప కీర్తి అని సీఎం చెప్పారు. చాకలి ఐలమ్మ ఉమెన్ యూనివర్సిటీలో పలు నూతన భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
చాకలి ఐలమ్మ ఉమెన్ యూనివర్సిటీ అభివృద్ధి పనులకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ వర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో పోటీ పడాలని చెప్పారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో చదివిన ప్రతి ఆడబిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలని అన్నారు. రెండున్నర ఏళ్లలో యూనివర్సిటీ నిర్మాణం కంప్లీట్ అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వర్సిటీ నిర్మాణానికి ఎలాంటి నిధుల ఢోకా ఉండదని సీఎం చెప్పుకొచ్చారు.
ALSO READ: UPSC Recruitment: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు.. ఇంకా 3 రోజులే గడువు
మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఏ రంగంలో అయినా విజయవంతం అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అన్నారు. మహిళలకు ఎలాంటి పాత్ర ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించామని పేర్కొన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా రాష్ట్రంలో మహిళలకు ప్రోత్సాహకం ఉంటుందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే వారు ముందు వారు చదువు కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.